X
దసరా
Action | 30 Mar 2023 | U/A | 156 Mins
Telugu

దసరా స్టోరీ

దసరా సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నానికీర్తి సురేష్, సాయి కుమార్, సముతిరకణి, దీక్షిత్ శెట్టి, పూర్ణ, జరీనా వాహబ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీకాంత్ ఓడేల వహించారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి  నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందించారు. 
  

మద్యం మత్తులో ఊగి తూగే కరీంనగర్ జిల్లా వీర్లపల్లిలో ధరణి (నాని), సూర్య (దీక్షిత్ శెట్టి), వెన్నెల (కీర్తి సురేష్) క్లోజ్ ఫ్రెండ్స్. తన ప్రాణం కంటే ఎక్కువగా సూర్యను ప్రేమించే ధరణి.. స్నేహం కోసం వెన్నెలపై ఉన్న ప్రేమను చంపుకొని.. స్నేహితుడి కోసం త్యాగం చేస్తాడు. వీర్లపల్లిలో పంచాయితీ సర్పంచ్ చిన్న నంబి (చాకో), సర్పంచ్ పదవికి పోటీ చేసి ఊడిన రాజన్న (సాయికుమార్) మధ్య వైరం ఉంటుంది. 

ఊరి రాజకీయాలు వల్ల ధరణి, సూర్యపై ఎటాక్ జరుగుతుంది. సూర్యను ఇష్టపడే వెన్నెలకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? సూర్య కోసం ధరణి ఎలాంటి రిస్క్ తీసుకొన్నాడు? ధరణితోపాటు స్నేహితులు మద్యానికి ఎందుకు అలవాటు పడ్డారు. రాజకీయాల వల్ల గ్రామంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. గ్రామంలో సిల్క్ బార్ కోసం నంబి, రాజన్న మధ్య ఎలాంటి వైరం కొనసాగింది.

సిల్క్ బార్ కోసం ధరణి చేసిన ఛాలెంజ్ ఏమిటి? సూర్యను ప్రేమించిన వెన్నెలకు ఎలాంటి సమస్య ఎదురైంది. ధరణి, సూర్యపై ఎటాక్ జరిగిన తర్వాత వెన్నెల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది. వెన్నెల జరిగిన అన్యాయానికి ధరణి ఎలాంటి పరిష్కారం చూపించాడు అనే ప్రశ్నలకు సమాధానమే దసరా సినిమా 
 

టీజర్
బొగ్గు గనులు ఉండే ఈర్లపల్లి అనే గ్రామంలో ఈ కథ నడుస్తుంది. "మందు అంటే మాకు వ్యసనం కాదు. అలవాటు పడిన సాంప్రదాయం" అంటూ మందుకొడుతూ హీరో నాని ఇంట్రడక్షన్ చూపించారు. ఊరిలో ఊరమాస్ గా తిరిగే హీరో, తన ఊరి కోసం ఏం చేశాడనే కోణంలో టీజర్ ను కట్ చేశారు.

ప్రీ రిలీజ్‌ బిజినెస్‌ 

దాదాపు ఈ సినిమాను 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.  ప్రపంచ వ్యాప్తంగా రూ. 50.00 కోట్లు వ్యాపారం జరిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 51 కోట్లు . ఇది నాని కెరీర్‌లోనే హైయ్యేస్ట్ బిజినెస్‌ అయిన మూవీగా నిలిచింది. పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేయబోతుండటం

ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్, సాంగ్ అండ్ టీజర్ చిత్రం పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. 


రిలీజ్ డేట్ 
మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+