X
దసరా

దసరా

Action | 30 Mar 2023 | U/A | 156 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

దసరా స్టోరీ

దసరా  సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో  నాని ,  కీర్తి సురేష్ , సాయి కుమార్, సముతిరకణి, దీక్షిత్ శెట్టి, పూర్ణ, జరీనా వాహబ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం  శ్రీకాంత్ ఓడేల  వహించారు. నిర్మాత సుధాకర్ చెరుకూరి  నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందించారు.     మూవీ స్టోరీ  మద్యం మత్తులో ఊగి తూగే కరీంనగర్ జిల్లా వీర్లపల్లిలో ధరణి (నాని), సూర్య (దీక్షిత్ శెట్టి), వెన్నెల (కీర్తి సురేష్) క్లోజ్ ఫ్రెండ్స్. తన ప్రాణం కంటే ఎక్కువగా సూర్యను ప్రేమించే ధరణి.. స్నేహం కోసం వెన్నెలపై ఉన్న ప్రేమను చంపుకొని.. స్నేహితుడి కోసం త్యాగం చేస్తాడు. వీర్లపల్లిలో పంచాయితీ సర్పంచ్ చిన్న నంబి (చాకో), సర్పంచ్ పదవికి పోటీ చేసి ఊడిన రాజన్న (సాయికుమార్) మధ్య వైరం ఉంటుంది.  ఊరి రాజకీయాలు వల్ల ధరణి, సూర్యపై ఎటాక్ జరుగుతుంది. సూర్యను ఇష్టపడే వెన్నెలకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? సూర్య కోసం ధరణి ఎలాంటి రిస్క్ తీసుకొన్నాడు? ధరణితోపాటు స్నేహితులు మద్యానికి ఎందుకు అలవాటు పడ్డారు. రాజకీయాల వల్ల గ్రామంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. గ్రామంలో సిల్క్ బార్ కోసం నంబి, రాజన్న మధ్య ఎలాంటి వైరం కొనసాగింది. సిల్క్ బార్ కోసం ధరణి చేసిన ఛాలెంజ్ ఏమిటి? సూర్యను ప్రేమించిన వెన్నెలకు ఎలాంటి సమస్య ఎదురైంది. ధరణి, సూర్యపై ఎటాక్ జరిగిన తర్వాత వెన్నెల జీవితం ఎలాంటి మలుపు తిరిగింది. వెన్నెల జరిగిన అన్యాయానికి ధరణి ఎలాంటి పరిష్కారం చూపించాడు అనే ప్రశ్నలకు సమాధానమే దసరా సినిమా    మూవీ డైలాగ్స్    టీజర్ బొగ్గు గనులు ఉండే ఈర్లపల్లి అనే గ్రామంలో ఈ కథ నడుస్తుంది. "మందు అంటే మాకు వ్యసనం కాదు. అలవాటు పడిన సాంప్రదాయం" అంటూ మందుకొడుతూ హీరో నాని ఇంట్రడక్షన్ చూపించారు. ఊరిలో ఊరమాస్ గా తిరిగే హీరో, తన ఊరి కోసం ఏం చేశాడనే కోణంలో టీజర్ ను కట్ చేశారు. ప్రీ రిలీజ్‌ బిజినెస్‌  దాదాపు ఈ సినిమాను 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.  ప్రపంచ వ్యాప్తంగా రూ. 50.00 కోట్లు వ్యాపారం జరిగింది. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 51 కోట్లు . ఇది నాని కెరీర్‌లోనే హైయ్యేస్ట్ బిజినెస్‌ అయిన మూవీగా నిలిచింది. పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చేయబోతుండటం ఇప్పటికే మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్, సాంగ్ అండ్ టీజర్ చిత్రం పై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి.  రిలీజ్ డేట్  మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది 
Read More

దసరా కాస్ట్ & క్రూ

దసరా సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీకాంత్ ఓడేల
స్టోరీ శ్రీకాంత్ ఓడేల
డైలాగ్ తోట శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు నవీన్ నూలి
సంగీతం సంతోష్ నారాయణన్
నిర్మాత సుధాకర్ చెరుకూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

దసరా విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
తెలంగాణ నేటివిటితో ప్రేమ, ప్రతీకారం, ఎమోషన్స్ దట్టించిన చిత్రం దసరా. దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు తొలి చిత్రమైనా అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను తెరకెక్కించారు. ప్రతీ ఫ్రేమ్‌ను చక్కగా ఒద్దికగా తెరకెక్కించారు. తెలంగాణ వాస్తవ పరిస్థితులను సజీవంగా చూపించే ప్రయత్నం చేశారు. కీర్తీ సురేష్ మరోసారి మహానటిని మించిన ఫెర్ఫార్మెన్స్‌ను ప్రదర్శించింది. ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి మరో ఎత్తు అనే విధంగా నాని తన పెర్ఫార్మెన్స్‌తో చెలరేగిపోయారు. అయితే స్క్రిప్టు విషయానికి వస్తే చాలా రొటీన్‌గా, రెగ్యులర్‌గా ఉంది. కానీ దర్శకుడు కథను నిజాయితీగా చెప్పిన విధానం బాగుంది. కథ స్వభావ రీత్యా ఇంకా ఎమోషన్స్ పండి ఉంటే దసరా మరింత బెటర్‌గా ఉండేది. నాని, కీర్తి సురేష్, దీక్షిత్ శెట్టి, చాకో ఫెర్ఫార్మెన్స్ ఈ సినిమాను మరో మెట్టు ఎక్కించింది. కొత్తదనం ఆశించే వారికి, నాని, కీర్తీ సురేష్ అభిమానులకు ఈ సినిమా నచ్చుతుంది.

దసరా ట్రైలర్

Video Thumbnail

దసరా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Excellent movie.. The selection of actors for the role is most perfect... Total entertainment

×
2.5 /5 Your Rating

దసరా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+