CelebsbredcrumbNani
  నాని

  నాని

  Actor/Producer
  Born : 24 Feb 1984
  Birth Place : హైదిరాబాద్, తెలంగాణ
  నాని అసలు పేరు నవీన్ బాబు ఘంటా .పుట్టిన ఊరు చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంద్రప్రదేశ్. నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. శ్రీను వైట్ల మరియు బాపు దగ్గర సహాయదర్శకుడిగా పనిచేశాడు. మొదటి తెలుగు సినిమా  అష్టా చమ్మా లో నటించాడు. ఆ... ReadMore
  Famous For

  నాని అసలు పేరు నవీన్ బాబు ఘంటా.పుట్టిన ఊరు చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంద్రప్రదేశ్. నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. శ్రీను వైట్ల మరియు బాపు దగ్గర సహాయదర్శకుడిగా పనిచేశాడు. మొదటి తెలుగు సినిమా  అష్టా చమ్మా లో నటించాడు. ఆ తరువాత నానికి ఎన్నో సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఢి ఫర్ దోపిడి సినిమాతో నిర్మాతగా మారాడు. స్నేహితుడా, అలా మొదలైంది,ఈగ,భలే భలే మగాడివోయ్,నేను లోకల్,నిన్ను కోరి సినిమాలు నానికి నటుడిగా మంచి పేరు తెచ్చాయి. నాని నటించిన ఈగ ప్రేక్షకులనుంచి మంచి ప్రశంసలు అందుకుంది. నాని తన నటనతో న్యాచురల్ స్టార్ గా ప్రేక్షకులుచె పిలవబడుతున్నాడు. కొద్ది రోజులు ఒక ప్రముఖ చానల్ లో వ్యాఖ్యాతగా...

  Read More
  • టక్ జగదీష్ మూవీ టీజర్
  • బేబీ టచ్ మీ నౌ వీడియో సాంగ్
  • నాని వి మూవీ ట్రైలర్
  • వి మూవీ టీజర్
  • వస్తున్నా వస్తున్నా వీడియో ప్రోమో - వి మూవీ సాంగ్..
  • 1
   నానిగా అందరికీ సుపరిచితమైన తెలుగు నటుడు నవీన్ బాబు ఘంటా. పుట్టిన ఊరు చల్లపల్లి (కృష్ణాజిల్లా) అయినా నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు.
  • 2
   చిరంజీవి, ర‌వితేజ త‌ర్వాత ఆ స్థాయిలో ఇమేజ్ తెచ్చుకున్న న‌టుడు నాని.
  • 3
   శీనువైట్లతో ఢీ.. బాపు రాధాగోపాలం సినిమాల‌కు స‌హాయ ద‌ర్శ‌కుడిగా ప‌నిచేసారు
  • 4
   ఓ సినిమా ఎడిట్ సూట్‌లో ఇంద్ర‌గంటి ఏదో ప‌ని మీద వ‌చ్చి నానిని చూడటం.. కుర్రాడెవ‌రో బాగున్నాడే అని త‌న సినిమాలో హీరోగా అవ‌కాశం ఇవ్వ‌డంతో నాని ద‌శ మారిపోయింది.
  • 5
   చిరంజీవి త‌ర్వాత ఏ అండదండ‌లు లేకుండా ఇంత‌గా మార్కెట్.. ఫ్యాన్స్ సంపాదించుకుంది ర‌వితేజ త‌ర్వాత నానినే.
  • 6

   అష్టాచ‌మ్మా త‌ర్వాత కూడా నానిని ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. రైడ్.. భీమిలి క‌బ‌డ్డి జ‌ట్టు లాంటి సినిమాలు న‌టుడిగా మంచి పేరు తీసుకొచ్చాయి కానీ విజ‌యం కాదు. కానీ 2011 ఈ హీరో కెరీర్ ను మార్చేసింది. ఆ ఏడాది అలా మొద‌లైంది.. పిల్ల జమీందార్ విజ‌యాల‌తో నాని క్రేజీ హీరో అయిపోయాడు.
  • 7
   ఈగ‌తో నేష‌న‌ల్ వైడ్ ఫేమ‌స్ అయిపోయాడు. అయితే అదే ఏడాది నానికి బ్యాడ్‌టైమ్ కూడా మొద‌లైంది. ఎటో వెళ్లిపోయింది మ‌న‌సు.. పైసా.. ఆహాక‌ళ్యాణం.. జెండా పై క‌పిరాజు ఇలా వ‌ర‌స సినిమాల‌యితే చేసాడు కానీ హిట్లు మాత్రం అందుకోలేదు
  • 8
   ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం. 2015 మార్చ్ 21న విడుద‌లైంది ఈ చిత్రం. ఆ త‌ర్వాత భ‌లేభ‌లే మగాడివోయ్ సినిమాతో నాని కాస్తా న్యాచుర‌ల్ స్టార్ అయ్యాడు. ఈ ప్ర‌యాణంలో ఎటో వెళ్లిపోయింది మ‌న‌సుకు నంది.. భ‌లేభ‌లే మ‌గాడివోయ్ సినిమాకు ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు నాని.
  • 9
   2015 ప్రథమార్ధంలో వచ్చిన ఎవడే సుబ్రహ్మణ్యం, కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాధ.. జెంటిల్ మ‌న్.. మ‌జ్ను.. నేనులోక‌ల్.. నిన్నుకోరి.. ఎంసిఏ సినిమాల‌తో వ‌ర‌సగా ఎనిమిది విజ‌యాలు
  నాని వ్యాఖ్యలు
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X