డియర్ కామ్రేడ్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న, శృతి రామచంద్రన్, చారు హాసన్, ఆనంద్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం భరత్ కమ్మ వహించారు మరియు మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ వారు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం జుతిన్ ప్రభాకరణ్ అందించారు.
కథ
బాబీ అలియాస్ చైతన్య (విజయ్ దేవరకొండ) కాలేజీ పాలిటిక్స్‌లో చురుకైన నాయకుడు. తొలి చూపులోనే లిల్లీ అలియాస్ అపూర్ణదేవీ (రష్మిక మందన) ప్రేమలో పడుతాడు. క్రికెటర్‌గా జాతీయ స్థాయిలో ఆడాలనే లక్ష్యాన్ని పెట్టుకొంటుంది. కానీ బాబీలో ఉండే ఆవేశం తనకు నచ్చదు. అయితే ఈ క్రమంలో ఓ సంఘటన కారణంగా బాబీ, లిల్లీ విడిపోతారు. మూడేళ్ల తర్వాత తాను ఎంతో ప్రేమించే బాబీని లిల్లీ వదిలి పోవడానికి కారణమేమిటి? లిల్లీ ఎందుకు డిప్రెషన్‌లోకి వెళ్లింది? లిల్లీ డిప్రెషన్‌కు కారణమేమిటి? మూడేళ్లపాటు దూరంగా ఉన్న బాబీ ఏం చేశాడు? కాలేజీ పాలిటిక్స్‌ను ఎందుకు వదులు కోవాల్సి వచ్చింది? లిల్లీ సమస్యకు పరిష్కారం చూపించే ప్రయత్నంలో బాబీ ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే డియర్ కామ్రేడ్ సినిమా కథ.