దడ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగచైతన్య, కాజల్, శ్రీరామ్, సమీక్ష, బ్రహ్మానందం, అలీ, రాహుల్‌దేవ్, ముఖేష్‌రుషి, కెల్లీ డార్జ్, తనికెళ్ల భరణి, వేణుమాధవ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అజయ్ భుయాన్ నిర్వహించారు మరియు నిర్మాత డి శివప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చరు.
కథ
న్యూయార్క్ లో ఉండే విశ్వ (నాగచైతన్య) తెలుగు హీరోలా ఎప్పుడూ ఏదో ఒక అన్యాయాన్నో, అక్రమాన్నో ఎదుర్కుంటూ ఏదో గొడవలో ఇరుక్కుంటూ ఉంటూంటాడు. చదువు పూర్తి చేసుకున్న అతను ఇండియా తిరిగి వెళ్లిపోదామనుకున్న సమయంలో రియా (కాజల్)పరిచయమై, అది ప్రేమకు దారితీస్తుంది. ఇక అక్కడ సిటిలో ఆర్.డి(రాహుల్ దేవ్), కెల్లి (కెల్లి) అనే ఇద్దరు డాన్ లు ఇంటర్నేషనల్ ప్రాసిట్యూషన్ రింగ్ ని నడిపిస్తూంటారు. అనుకోకుండా విశ్వ వారి వ్యాపారానికి అడ్డుపడి వారి హ్యాండోవర్ లో ఉన్న అమ్మాయిల్ని తప్పిస్తాడు. దాంతో మండిపడ్డ ఆర్.డి, కెల్లి ఏం చేసారు. విశ్వ ప్రేమ కథ సక్సెస్ అయ్యిందా అనే విషయాలు చుట్టూ కథ తిరుగుతూంటుంది.