X
ధృవ
Action | Romance | 09 Dec 2016 | U/A |
Telugu

ధృవ స్టోరీ

ధృవ సినిమా తమిళంలో ఘన విజయం సాధించిన 'తని ఒరువన్' చిత్రానికి రీమేక్ ఇది యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్ తేజ, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నవదీప్, ఉపేన్ రెడ్డి, రణ్ ధీర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సురేందర్ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత అల్లు అరవింద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హిప్ హోప్ తమిజ స్వరాలు సమకుర్చరు.
 
కథ

ఐపీఎస్ ట్రైనింగ్ లో ఉన్న ధృవ (రామ్ చరణ్)చాలా తెలివైన వాడు. తను పేపర్లో చదివే వార్తలకు, బయిట జరుగుతున్న ఇన్సిడెంట్స్ కు మధ్య ఉన్న లింక్ లను గుర్తించగలగిన వాడు. అంతేకాకుండా ట్రైనింగ్ లో ఉండగానే రిస్క్ చేసి, తన ఫ్రెండ్స్ తో కలిసి సీక్రెట్ గా రాత్రిళ్లు.. సిటీలో జరిగే చిన్నపాటి క్రైమ్స్ ని అరికడుతూ నేరస్థుల్ని పోలీసులకు పట్టుబడేలా చేస్తుంటారు. అలా వాళ్ళు కష్టపడి పోలీసులకు అప్పగించిన నేరస్తుల్లో ఒకడు చట్టంలో లొసుగులు ఆధారంగా సులభంగా తప్పించుకుని బయట తిరగడం గమనించిన ధృవ, అతని స్నేహితులు అదంతా ఎలా జరిగింది బాధపడతారు. తర్వాత కారణం అన్వేషిస్తాడు ధృవ. అసలు వీటిన్నటి వెనకే ఓ మాస్టర్ క్రిమినల్ మైండ్ ఉందని గమనిస్తాడు. మరో ప్రక్క ..ధృవ తాను ఎన్నాళ్లగానో రీసెర్చ్ చేస్తున్న ఒక విషయం కొలిక్కి వచ్చిందని గుర్తిస్తాడు. పైకి కనిపించే ఆ చిన్న చిన్న క్రైమ్ లు వెనక పెద్ద కుట్ర ఉందని అర్దం చేసుకుంటాడు. తన ఫ్రెండ్స్ కు దాని గురించి చెప్పి, దాన్ని సాల్వ్ చేసి ఈ చిన్న చిన్న నేరాలన్నింటికీ కారణమైన పెద్ద క్రిమినల్ ని పట్టుకోవాలన్నదే తన లక్ష్యమని చెప్పి ఆ క్రిమినల్ కోసం వెతుకుతుంటాడు. అలా మెయిన్ క్రిమినల్ కోసం వెతుకుతున్న ధృవకు అనుకోకుండా సిద్దార్థ అభిమన్యు (అరవింద స్వామి) అనే సైంటిస్ట్ పై అనుమానం వస్తుంది. తన అవసరాల కోసం అబిమన్యు మెడికల్ ఫీల్డ్ ని అడ్డం పెట్టుకుని అక్రమాలు చేస్తున్నాడని అర్దం చేసుకుంటాడు. అక్కడ నుంచి కథ మలుపు తిరుగుతుంది.. అతన్ని ఆధారాలతో అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తూండు ధృవ. యుద్దం మొదలైంది. ఓ పెద్ద ఫార్మా ఎంపైర్ ని నిర్వహిస్తున్న సిద్దార్ద ... ఓ ఫారిన్ ఫార్మా కంపెనీ వారు ప్రొడ్యూస్ చేసే ఓ జనరిక్ డ్రగ్ కు చెందిన కాంటాక్ట్ డీల్ పనిలో ఉంటాడు. అయితే ఆ డీల్ ని ఆపటానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారని అతనికి అర్దం అవుతుంది. తన డేగ కళ్లతో అలా తనకు అడ్డు పడుతోంది ధృవ అని తెలుసుకుంటాడు. పిల్లి-ఎలుక ఆటకు తెరలేపుతాడు. అక్కడ నుంచి ఇద్దరి తెలివైన వాళ్ల మధ్య మైండ్ గేమ్ ప్రారంభం అవుతుంది. పేదవారి ప్రాణాలను కాపాడటం కోసం అతి తక్కువ రేటుకే జనరిక్ మందులను అందించే అగ్రిమెంట్ ను అడ్డుకొని దేశం మొత్తం తన చెప్పు చేతల్లోకి తెచ్చుకోవాలనుకున్న విలన్ సిద్దార్థ్ విషయం ఎలా రివీల్ అయ్యింది. ధృవ... సిద్దార్ధ్ ను ఎలా అడ్డుకున్నాడు..? ఎంతో తెలివిగా నేర సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న సిద్దార్ధ్ ని ఎలా దెబ్బ తీసాడు? చివరకు ధృవ అనుకున్నది సాధించాడా..? సిద్దార్ధ్ అభిమన్యు ఏమయ్యాడు..? అన్నదే మిగతా కథ. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+