తెలుగు సినిమాల్లో బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ & శాండల్ వుడ్ నుండి వచ్చిన చాలా మంది నటీమణులు మన తెలుగు పరిశ్రమలో బాగానే రాణిస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నుండి వచ్చిన అనేకమంది కథానాయికలు ఇక్కడ స్టార్ హీరోయిన్స్‌గా నిరూపించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ పైన చెరగని ముద్రవేసిన పలువురు బాలీవుడ్ హీరోయిన్స్ గురించి.. వారు నటించిన సినిమాల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.