దిక్కులు చూడకు రామయ్య సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అజయ్,నాగ శౌర్య, ఇంద్రజ, సన మక్బూల్, నాగినీడు, అలీ, విశాల్, రమేష్, హరితేజ, వేణు తదితరులు ప్రదాన పాత్రలలో నటించారు. ఈ సినిమా కు కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: త్రికోటి నిర్వహించారు, నిర్మాత: రజనీకొర్రపాటి నిర్మించారు. సంగీతదర్శకుడు కీరవాణి స్వరాలు సమకుర్చారు.
కథ
స్టేట్ బ్యాంక్ లో పని చేసే గోపాలకృష్ణ(అజయ్) తప్పనిసరి పరిస్ధితుల్లో వివాహం చేసుకోవాల్సి వస్తుంది. దాంతో ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అనే అతని కల నెరవేకుండా మిగిలిపోతుంది. అయితే ఆ కోరిక వాస్తవ రూపం దాల్చే సమయం...సంహిత(సన మక్బూల్)పరిచయంతో జరుగుతుంది. తన కన్నా సగం వయస్సు ఉన్న ఆమెతో తాను అవివాహితుడునని చెప్పి ప్రేమించటం మొదలెడతాడు. అయితే ట్విస్ట్ ఏమిటంటే.. గోపాల్ కృష్ణ పెద్ద కొడుకు మధు(నాగ శౌర్య) కూడా ఆమెతోనే ప్రేమలో పడతాడు. ఒకరి విషయం మరొకరికి తెలియక ..ఇద్దరూ ఆమె చుట్టూ ప్రేమిస్తూనంటూ తిరుగుతారు. చివరకు గోపాల కృష్ణకు అసలు విషయం ఎప్పుడు తెలిసింది. చివరకు ఏం జరిగిందనేది మిగతా కథ.