డాన్ శీను సినిమా యాక్షన్ కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, శ్రీహరి, శ్రియ, అంజనా సుఖానీ, శాయాజీ షిండే, మహేష్ ముంజ్రేకర్, బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్, రఘు బాబు, కస్తూరి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గోపీచంద్ మాలినేని నిర్వహించారు మరియు నిర్మాత వెంకట్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
శీను(రవితేజ)కి చిన్నప్పటి నుంచీ అమితాబ్ సినిమా డాన్ అంటే విపరీతమైన పిచ్చి. దాంతో పెద్దయ్యాక తాను డాన్ అవ్వాలని..తనని అందరూ డాన్ శ్రీను అని పిలవాలని కోరుకుంటాడు. (అయితే ఎంత తింగరోడైనా పెద్దయ్యాక ఇలా సినిమాల్లో డాన్ లా అవ్వాలని ఎవరన్నా అనుకుంటాడా అని లాజిక్కు తీయకండి). ఆ కోరికను తీర్చుకోవటానికి మన శీను..సారి డాన్ శీను హైదరాబాద్ వస్తాడు. అతనొచ్చే సమయానికి హైదరాబాద్ ని మాచిరాజు(షాయాజీ షిండే), నర్సింగ్(శ్రీహరి) అనే ఇద్దరు డాన్ లు పాలిస్తూంటారు. ఇద్దరికీ ఒకరంటే మరొకరకి పడదు. ఇది గమనించిన శీను తన తెలివితో మాచిరాజుని ఆకర్షించి అతని గ్యాంగ్ లో చేరతాడు. అక్కడ మాచిరాజు..శీను షార్ప్ నెస్ చూసి తన రైవల్ అయిన నర్సింగ్ చెల్లెలుని ప్రేమలో పడేయ్యమని పని అప్పచెబుతాడు. నర్సింగ్ చెల్లెలు..జర్మనీలో ఉంది. అయితే ఆమెకు ఆల్రెడీ సూపర్ డాన్ దుగ్గల్ భాయ్(మహేష్ మంజ్రేకర్) కొడుకుతో పెళ్ళి సెట్ అయి ఉంటుంది. ఇక జర్మనీ వెళ్లిన శీను అక్కడ దీప్తి(శ్రియ)ని ప్రేమలో పడేస్తాడు. అయితే అతనికి తెలిసే విషయం ఏమిటంటే..దీప్తి..నర్సింగ్ చెల్లెలు కాదని...మాచిరాజు చెల్లెలని. అప్పుడు శీను ఏం చేసాడు. ఇద్దరు డాన్ లకు ఎలా బుద్ది చెప్పాడనేది మిగతా కథ.