X
తెలుగు » సినిమాలు » డాన్ శీను
డాన్ శీను

డాన్ శీను

Action | Romance | 10 Aug 2010 | U/A |
Telugu

2.6 /5 Users

1.5 /5 Filmibeat

డాన్ శీను స్టోరీ

డాన్ శీను సినిమా యాక్షన్ కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, శ్రీహరి, శ్రియ , అంజనా సుఖానీ , శాయాజీ షిండే, మహేష్ ముంజ్రేకర్, బ్రహ్మానందం, అలీ, వేణు మాధవ్, రఘు బాబు, కస్తూరి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గోపీచంద్ మాలినేని నిర్వహించారు మరియు నిర్మాత వెంకట్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చారు. కథ శీను(రవితేజ)కి చిన్నప్పటి నుంచీ అమితాబ్ సినిమా డాన్ అంటే విపరీతమైన పిచ్చి. దాంతో పెద్దయ్యాక తాను డాన్ అవ్వాలని..తనని అందరూ డాన్ శ్రీను అని పిలవాలని కోరుకుంటాడు. (అయితే ఎంత తింగరోడైనా పెద్దయ్యాక ఇలా సినిమాల్లో డాన్ లా అవ్వాలని ఎవరన్నా అనుకుంటాడా అని లాజిక్కు తీయకండి). ఆ కోరికను తీర్చుకోవటానికి మన శీను..సారి డాన్ శీను హైదరాబాద్ వస్తాడు. అతనొచ్చే సమయానికి హైదరాబాద్ ని మాచిరాజు(షాయాజీ షిండే), నర్సింగ్(శ్రీహరి) అనే ఇద్దరు డాన్ లు పాలిస్తూంటారు. ఇద్దరికీ ఒకరంటే మరొకరకి పడదు. ఇది గమనించిన శీను తన తెలివితో మాచిరాజుని ఆకర్షించి అతని గ్యాంగ్ లో చేరతాడు. అక్కడ మాచిరాజు..శీను షార్ప్ నెస్ చూసి తన రైవల్ అయిన నర్సింగ్ చెల్లెలుని ప్రేమలో పడేయ్యమని పని అప్పచెబుతాడు. నర్సింగ్ చెల్లెలు..జర్మనీలో ఉంది. అయితే ఆమెకు ఆల్రెడీ సూపర్ డాన్ దుగ్గల్ భాయ్(మహేష్ మంజ్రేకర్) కొడుకుతో పెళ్ళి సెట్ అయి ఉంటుంది. ఇక జర్మనీ వెళ్లిన శీను అక్కడ దీప్తి(శ్రియ)ని ప్రేమలో పడేస్తాడు. అయితే అతనికి తెలిసే విషయం ఏమిటంటే..దీప్తి..నర్సింగ్ చెల్లెలు కాదని...మాచిరాజు చెల్లెలని. అప్పుడు శీను ఏం చేసాడు. ఇద్దరు డాన్ లకు ఎలా బుద్ది చెప్పాడనేది మిగతా కథ.
Read More

డాన్ శీను కాస్ట్ & క్రూ

డాన్ శీను సిబ్బంది సమాచారం

దర్శకత్వం గోపిచంద్ మలినేని
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత వెంకట్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

డాన్ శీను విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
క్యాచీగా ఉండే టైటిల్, రవితేజ మార్కు కామిడీ, బ్రహ్మానందం సడెన్ ఎంట్రీ, హీరోయిన్ సెక్సీ డాన్స్ లు...కలిగలిపితే చాలు సినిమా సూపర్ హిట్టు...అన్న భ్రమతో తీసిన చిత్రం డాన్ శీను. కథను ప్రక్కన పెట్టి కామిడీ కోసం కథనాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకుంటూ ఆల్రెడి వచ్చిన చిత్రాల సీన్స్ ను గుర్తు చేస్తూ వచ్చిన ఈ చిత్రం ఫస్టాఫ్ ఓకే అనిపించుకుంది కానీ సెకెండాఫ్ దారుణంగా మారిపోయింది. వరసగా నవ్వించటానికే అన్నట్లు అక్కడిక్కడ పంచ్ చూసుకుని అల్లిన స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు సహన పరీక్ష పెట్టి రవితేజ..ఖతర్నాక్ ని గుర్తు చేసింది. రవితేజ, కామిడీ ఉంటే సరిపోదు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసే కథ కూడా కావాలని నొక్కి చెప్పిన చిత్రం ఇది.

డాన్ శీను సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • kannada gaja

×
2.6 /5 Your Rating

డాన్ శీను

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+