దూసుకెళ్తా సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మంచు విష్ణు వర్ధన్, లావణ్య త్రిపాఠి, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, పంకజ్ త్రిపాఠి, పోసాని, రఘుబాబు, భరత్, అన్నపూర్ణమ్మ, రజిత, సురేఖావాణి, హేమ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం : వీరూ పోట్ల నిర్వహించారు, నిర్మాత : మంచు మోహన్‌బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
రవితేజ వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన ఈ చిత్రం లో చిన్నా(మంచు విష్ణు) ఓ టీవీ ఛానెల్ లో జర్నలిస్ట్ గా పనిచేస్తూంటాడు. మినిస్టర్ పై ఓ స్టింగ్ ఆపరేషన్ చేసి వస్తూంటే అతన్ని గూండాలు వెంటబడి కొట్టి పోతారు. అలా పడిపోయిన అతన్ని డాక్టర్ అలేఖ్య(లావణ్య త్రిపాఠి) రక్షించి హాస్పటల్ లో ట్రీట్ మెంట్ చేయిస్తుంది. ఏ చిన్న హెల్ప్ చేసినా చిన్నా మర్పిపోడు అనే క్యారెక్టరైజేషన్ తో ఉన్న చిన్నా ఆమెతో తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు. అంతేకాదు...తనకు సాయిం చేసిన ఆమెకు ఏదైనా సాయిం చేయాలనుకుంటాడు. ఈ లోగా ఆమెను కొంతమంది చంపటానికి వెంటాడుతున్నారని తెలుస్తుంది. వారి నుంచి ఆమెను రక్షించే ప్రాసెస్ లో అతనికి మరిన్ని నిజాలు తెలుస్తాయి. ఆ నిజాలేంటి...ఆమెను ఎవరు...ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది మిగతా కథ.