దుబయ్ శీను సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవి తేజ, నయనతార, క్రిష్ణా భగవాన్, ఎమ్ ఎస్ నారాయణ, జె డి చక్రవర్తి, వేణు మాధవ్, సయాజి షిండే, రఘు బాబు, బ్రహ్మనందం, సురేక వాణి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీను వైట్ల నిర్వహించారు మరియు నిర్మాత డి వి వి దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణి శర్మ స్వరాలు సమకుర్చారు.
కథ
శీను (రవి తేజ) అందరు దుబాయి శీను అని అంటారు. శీను జీవిత ఆశయం దుబాయి కి వేళ్ళి డబ్బులు సంపాదించాలనేది ఆ ప్రయత్నంలోనే ముంబాయి లో ఒక మద్యవర్తిని కలుస్తారు కాని అతని వల్ల పూర్తిగా మోసపోతారు. అక్కడ తన స్నేహితులు కలిసి క్యాంటిన్ పేట్టి డబ్బులు బ్రతకడానికి సంపాదిస్తుంటారు అప్పుడు మధుమతి (నయనతార) కలుసుంది. మధుమతి తన అన్నా (జెడి చక్రవర్తి ) కోసం వేతుకుతుంటుంది కాని అంతకు ముందే శీను కు మంచి స్నేహితుడైన చక్రవర్తి ని కొంత మంది చంపిన విషయం మధుమతికి చేప్పుతాడు. వాళ్ళిద్దరు కలిసి అక్కడ నుంచి హైదరబాదు కు వస్తారు. శీను తన స్నేహితుడిని చంపిన వాళ్ళని ఎలా చంపుతాడు? అనేది మిగతా కథా...