ఎందుకంటే ప్రేమంట సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్, తమన్నా, రాధికా ఆప్టే, సుమన్, షాయాజి షిండే, రఘుబాబు, సుమన్ శెట్టి తదితరులు మాటలు: కోన వెంకట్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కరుణాకరన్ నిర్వహించారు మరియు నిర్మాత పి రవికిషోర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జి వి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకుర్చారు.
కథ
భాధ్యతలు అంటే పట్టని అల్లరి కుర్రాడు రామ్(రామ్). తన మాట వినకపోవటంతో రామ్ ని ప్లాన్ చేసి ప్యారిస్ పంపుతాడు అతని తండ్రి(షాయాజి షిండే). ఆ దేశంలో ఎంజాయ్ చేయవచ్చు అని ఎగేసుకుంటూ వెళ్లిన అతనికి అక్కడో ట్విస్ట్ ఎదురౌతుంది. అతని పాస్ పోర్ట్ కూడా లాగేసుకుని అక్కడ ద్రాక్ష సారాయి ప్యాక్టరీలో అతన్ని కష్టపడి పనిచేసుకు బ్రతమని ఇరికిస్తారు. చేతులో డబ్బులేక, చెప్పుకునే దిక్కులేక విషాద యోగంలో ఉన్న అతనికి స్రవంతి(తమన్నా)పరిచయం అవుతుంది. ఆమె అక్కడున్న ఇండియన్ అంబాసిడర్(సుమన్)కూతురు. ఛేజింగ్ లిబర్డి తరహాలో ఆమె స్వేచ్చను వెతుక్కుంటూ బయిటకు వస్తుంది. రామ్ కి పరిచయం అయిన ఆమె అతన్ని ప్యారిస్ నుంచి ఇండియా వెళ్లి పోవటానికి సహాయం చేస్తానంటుంది. అయితే తననుకూడా అతనితో పాటే ఇండియా తీసుకు వెళ్ళాలని కండీషన్ పెడుతుంది. సరేనన్న రామ్ ఆ తర్వాత ఆమె గురించి ఓ నిజం తెలిసి షాక్ అవుతాడు. ఇంతకీ రామ్ ని అంతలా షాక్ కి గురి చేసిన నిజం ఏమిటి.. .అసలు ఆమె.. రామ్ కి దగ్గరవటానికి కారణం ఏమిటి అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.