రామ్ గోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్ గా, అసోసియేట్ డైరెక్టర్స్ గా, కో డైరెక్టర్స్ గా పని చేసిన వారందరూ ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ గా సక్సెస్ఫుల్ ప్రయాణం చేస్తున్నారు. ఆర్జీవీ దగ్గర దర్శకత్వంలో శిష్యరికం చేసిన ఎంతో మంది ఇప్పుడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ గా రాణిస్తున్నారు. వర్మను తిట్టేవాళ్ళు ఎంతమందున్న ఆయనను ఇష్టపడేవాళ్లు కూడా అంతే ఉన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో కాదు భారతీయ సినీ పరిశ్రమలో దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ ప్రత్యేక గుర్తింపు వుంది. టాలీవుడ్, బాలీవుడ్‌లో ఎంతో మంది దర్శకులు వర్మ దగ్గర ఓనమాలు నేర్చుకొని ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ డైరెక్టర్స్ గా గుర్తింపు తెచ్చుకున్న పూరీ జగన్నాథ్, కృష్ణవంశీ, తేజ, హరీష్ శంకర్ వర్మ ఇన్‌స్ప్రేషన్‌తో ఎంతో మంది దర్శకులు అయ్యారు. రామ్ గోపాల్ వర్మ దగ్గర శిష్యరికం చేసిన తెలుగు డైరెక్టర్స్ ఎవరెవరో తెలుసుకుందాం