ఎవరు సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అడివి శేష్, రెజీన కాసాండ్ర, నవీన్ చంద్ర, మురళి శర్మ, పవిత్రా లోకేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెంకట్ రాంజి వహించారు మరియు నిర్మాతలు ప్రసాద్ వి పొట్లూరి, పరం వీ పొట్లూరి, కెవిన్ అన్నె కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీ చరణ్ పాకాల అందించారు. సినిమాటోగ్రఫి: వంశీ పచ్చిపులుసు, ఎడిటర్: గ్యారీ బీహెచ్
కథ
ప్రముఖ పారిశ్రామిక వేత్త సమీర్ మహా (రెజీనా కసండ్రా) కొన్ని పరిస్థితుల్లో పోలీస్ ఆఫీసర్ అశోక్ (నవీన్ చంద్ర) హత్యకేసులో నిందితురాలిగా మారుతుంది. తనను రేప్ చేయడానికి ప్రయత్నించడంతో హత్యకు పూనుకొన్నాననే వాదన వినిపిస్తున్న సమీరాకు సహాయం చేయడానికి ఓ అవినీతి పోలీస్ అధికారి విక్రమ్ వాసుదేవన్ ( అడివి శేషు) రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో వినయ్ వర్మ (మురళీశర్మ) మిస్సింగ్ కేసు తెరపైకి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసుకు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని విక్రమ్ సేకరిస్తాడు. పోలీస్ ఆఫీసర్ అశోక్‌ను సమీరా ఎందుకు చంపాల్సి వచ్చింది? వినయ్ వర్మ మిస్సింగ్ కేసుకు అశోక్ హత్యకు ఏదైనా సంబంధం ఉందా? ఉద్దేశపూర్వకంగా సమీరా హత్య చేసిందా? లేక ఆత్మరక్షణ కోసం మర్డర్ చేసిందా? విక్రమ్ వాసుదేవన్ ఎందుకు ఈ కేసులో తలదూర్చాడు? చివరికి సమీరా కేసు నుంచి బయటపడిందా? అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే ఎవరు మూవీ కథ.