X
ఎవరు

ఎవరు

Thriller | 15 Aug 2019 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

ఎవరు స్టోరీ

ఎవరు సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అడివి శేష్, రెజీన కాసాండ్ర, నవీన్ చంద్ర, మురళి శర్మ, పవిత్రా లోకేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వెంకట్ రాంజి వహించారు మరియు నిర్మాతలు ప్రసాద్ వి పొట్లూరి, పరం వీ పొట్లూరి, కెవిన్ అన్నె కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం శ్రీ చరణ్ పాకాల అందించారు. సినిమాటోగ్రఫి: వంశీ పచ్చిపులుసు, ఎడిటర్: గ్యారీ బీహెచ్  కథ ప్రముఖ పారిశ్రామిక వేత్త సమీర్ మహా (రెజీనా కసండ్రా) కొన్ని పరిస్థితుల్లో పోలీస్ ఆఫీసర్ అశోక్ (నవీన్ చంద్ర) హత్యకేసులో నిందితురాలిగా మారుతుంది. తనను రేప్ చేయడానికి ప్రయత్నించడంతో హత్యకు పూనుకొన్నాననే వాదన వినిపిస్తున్న సమీరాకు సహాయం చేయడానికి ఓ అవినీతి పోలీస్ అధికారి విక్రమ్ వాసుదేవన్ ( అడివి శేషు) రంగంలోకి దిగుతాడు. ఈ క్రమంలో వినయ్ వర్మ (మురళీశర్మ) మిస్సింగ్ కేసు తెరపైకి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కేసుకు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని విక్రమ్ సేకరిస్తాడు. పోలీస్ ఆఫీసర్ అశోక్‌ను సమీరా ఎందుకు చంపాల్సి వచ్చింది? వినయ్ వర్మ మిస్సింగ్ కేసుకు అశోక్ హత్యకు ఏదైనా సంబంధం ఉందా? ఉద్దేశపూర్వకంగా సమీరా హత్య చేసిందా? లేక ఆత్మరక్షణ కోసం మర్డర్ చేసిందా? విక్రమ్ వాసుదేవన్ ఎందుకు ఈ కేసులో తలదూర్చాడు? చివరికి సమీరా కేసు నుంచి బయటపడిందా? అనే ప్రశ్నలకు తెర మీద సమాధానమే ఎవరు మూవీ కథ.
Read More

ఎవరు కాస్ట్ & క్రూ

ఎవరు సిబ్బంది సమాచారం

దర్శకత్వం వెంకట్ రాంజి
సినిమాటోగ్రఫీ వంశీ పచ్చిపులుసు
సంపాదకుడు గ్యారీ బీహెచ్
సంగీతం శ్రీచరణ్ పాకాల
నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఎవరు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఎమోషనల్ కంటెంట్‌తోపాటు టెక్నికల్‌గా బలమైన అంశాలున్న చిత్రం ఎవరు. అనేక మలుపులతో సరికొత్త సస్సెన్స్, థ్రిలర్ అనే ఫీలింగ్‌ను కల్పిస్తుంది. మేకింగ్ విషయంలో గ్రిప్పింగ్‌గా ఉండటంతోపాటు ప్రేక్షకుడిని మెదడుకు పదును పెట్టే అంశాలకు స్కోప్ ఉన్న చిత్రంగా చెప్పవచ్చు. థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే వారికి ఎవరు మరింత నచ్చేలా ఉంటుంది. పీవీపీ సంస్థ నిర్మాణ విలువలు సినిమాకు ది బెస్ట్‌ అనే ఫీలింగ్ కలిగిస్తాయి. అలాగే నటీనటుల ఎంపిక విషయంలోనూ పీవీపీ ఛాయిస్ బాగుంది. మల్టీప్లెక్స్, ఏ, బీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చడానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. సీ సెంటర్లలో ప్రేక్షకాదరణ తోడైతే కమర్షియల్ పెద్ద విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఎవరు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఎవరు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+