ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) (2019)(U/A)
Release date
12 Jan 2019
genre
ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) స్టోరి
ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) సినిమా కామిడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది అగ్రకథానాయకుడు విక్టరీ వెంకటేశ్, మెగాహీరో వరుణ్‌తేజ్‌ల కాంబినేషన్ మల్టీస్టారర్ చిత్రం ఇంకా ఇందులో తమన్నా, మెహరీన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శక్వం అనిల్ రావిపూడి వహించారు మరియు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించారు.
కథ :
ఎమ్మెల్యే వద్ద పీఏగా పనిచేసే వెంకీ (వెంకటేష్)కి హారిక (తమన్నా)తో పెళ్లి జరుగుతుంది. తొలి ఆర్నెళ్లు ఎంజాయ్‌గా గడిచిపోతుంది. ఆ తర్వాత ఇగోలు, అభిప్రాయాలు తలెత్తుతాయి. దాంతో వెంకీ జీవితంలో ఫ్రస్టేషన్ మొదలవుతుంది. ఇక వరుణ్ (వరుణ్ తేజ్) తమన్నా చెల్లెలు హానీ (మెహ్రీన్)తో ప్రేమలో ఉంటాడు. వెంకీ వేసిన ఎత్తు విఫలమై వరుణ్, మెహ్రీన్ పెళ్లి కుదురుతుంది. కానీ పెళ్లికి ముందే అత్తారింటి, ప్రియురాలి టార్చర్‌తో జీవితం నరకంగా మారుతుంది. ఇక పొరుగింటి వ్యక్తి (రాజేంద్ర ప్రసాద్) సలహాతో పెళ్లి పీటల మీద నుంచి వరుణ్‌తోపాటు వెంకీ యూరప్‌తో పారిపోతారు. వరుణ్, వెంకీ, రాజేంద్రప్రసాద్ యూరప్‌లో ఓ కేసులో ఇరికిపోతారు. ఆ తర్వాత భర్తను, ప్రియుడ్ని వెతుకుంటూ అక్కాచెల్లెలు యూరప్ వచ్చి దొరస్వామి (ప్రకాశ్ రాజ్) ఇంట్లో చేరుతారు?
యూరప్‌కు వెళ్లిన తర్వాత తమన్నా, మెహ్రీన్ పరిస్థితి ఏంటి? యూరప్‌కు వెళ్లిన తర్వాత వరుణ్, వెంకటేష్, రాజేంద్ర ప్రసాద్ ఎలా ఫన్ చేశారు? వారు కేసులో ఇరుక్కుపోవడానికి కారణమేంటి? ఈ కథలో దొరస్వామి (ప్రకాశ్ రాజ్) పాత్ర ఏంటి? భర్తను, ప్రియుడ్ని వదలిసే దొరస్వామి ఇద్దరు కొడుకులను తమన్నా, మెహ్రీన్ ఎందుకు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. భార్య, ప్రేయసిల పెళ్లిని చెడగొట్టడానికి ఎలాంటి ఎత్తులు వేశారు? ఈ కథలో నూతన్ నాయుడు, వెన్నెల కిషోర్ దొరైస్వామిని ఎందుకు చంపాలని ప్రయత్నిస్తుంటారు. అనసూయ పాత్ర కథకు ఎలా కీలకంగా మారింది? చివరకు భార్య, ప్రేయసిలను వెంకీ, వరుణ్ ఎలా దక్కించుకొన్నారు అనే ప్రశ్నలకు సమాధానమే ఎఫ్2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా.
**Note:Hey! Would you like to share the story of the movie ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) with us? Please send it to us ([email protected]).
సంబంధిత వార్తలు