ఫ్రెండ్స్ బుక్ సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు నిశ్చల్, ఉదయ్, అర్చన, సుర్య, సురేష్, నిషా శెట్టి, రావు రమేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ, సంగీతం, దర్శకత్వం : ఆర్పీ పట్నాయక్ నిర్వహించారు మరియు నిర్మాత ముళ్లా విజయప్రసాద్ నిర్మించారు.
కథ
నిశ్చల్, అక్షయ్, సూర్య, నిత్యా, మధు, రాజు చిన్నప్పటి నుంచి స్నేహితులు. రాజు మినహా అంతా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు. మిగతా వారంతా జాబ్ చేయడం ఇష్టం లేక బిజినెస్ చేద్దామని ట్రై చేస్తారు. ఈ క్రమంలో వారికి ఫేస్‌బుక్ లో ఫేక్ అకౌంట్ల వల్ల కలిగే నష్టాన్ని నివారించానికి సాఫ్ట్ వేర్ కనిపెట్టాలనే ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన వచ్చిందే ఆలస్యం చాలా కష్టపడి సాఫ్ట్ వేర్ డెవలప్ చేస్తారు. దీన్ని ఫేస్ బుక్ వారికి అమ్మాలని తిరుగుతుండగా వారికి ఫేస్ బుక్‌లో పని చేసే శ్రీనివాస్ మహాలింగం అనే వ్యక్తి పరిచయం అవుతాడు. అతను వారు తయారు చేసిన సాఫ్ట్ వేర్‌ను మెచ్చుకుని....కంపెనీ యాజమాన్యంతో డీల్ కుదుర్చుకునేందుకు అమెరికా తీసుకెళ్లడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు. అయితే అనుకోని ప్రమాదంలో సూర్య చనిపోతాడు. వారి సాఫ్ట్ వేర్ కూడా దొంగిలించ బడుతుంది. ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న వారికి అక్షయ్‌తో సూర్య ఆత్మ చాటింగ్‌లోకి వస్తుంది. తాను ప్రమాదంలో చనిపోలేదని, చంపబడ్డానని చెబుతుంది ఆ ఆత్మ. మరి సూర్యను ఎవరు ఎందుకు చంపారు అనేది మిగిలిన కథ.