twitter

    గగనం స్టోరి

    గగనం సినిమా థ్రిల్లర్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అక్కినేని నాగార్జున, ప్రకాష్ రాజ్, పూనమ్ కౌర్, సనాఖాన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాధామోహన్ నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ప్రవీణ్ మణి స్వరాలు సమకుర్చారు.

    కథ

    ఇక కధ విషయానికి వస్తే బిన్న నేపద్యాల నుండి వచ్చిన ప్రయాణికులు చెన్నై నుండి ఢిల్లీ వెళ్ళటానికి స్టార్ జెట్ అనే విమానం ఎక్కుతారు. బయలుదేరిన కొద్ది సమయానికే ఐదుగురు టెర్రరిస్ట్ లు విమానాన్ని హైజాక్ చేస్తారు. దాంతో తిరుపతిలో అత్యవసరంగా ల్యాండ్ అవుతుంది విమానం. 100 కోట్ల నగదు తో పాటు వారి నాయకుడు యూసఫ్ ఖాన్ ను కూడా విడుదల చేయాలి లేదంటే విమానంలో ఉన్న 100 మందిని చంపేస్తామని బెదిరిస్తారు. ఈ విషయం తో అలెర్ట్ అయిన ప్రభుత్వం వారితో చర్చలకు ప్రయత్నిస్తుంది. ఈ ప్రమాదం నుండి బయట పడటానికి నేషనల్ సెక్యూరిటీ చీఫ్ మేజర్ వి.రవీంద్ర(నాగార్జున)ను పిలిపిస్తారు. హోం సెక్రటరీ విశ్వనాధ్ (ప్రకష్ రాజ్) ను కమాండో యాక్షన్ కోసం అడుగుతాడు రవీంద్ర. కానీ విమానంలో ఓ కేంద్ర మంత్రి ఉండటం, రాబోయే మూడు నెలల్లో ఎలక్షన్లు ఉండటంతో అందుకు ప్రభుత్వం ఒప్పుకోదు. చివరికి చేసిది ఏమి లేక యూసఫ్ ఖాన్ ను విడుదల చేయటానికి నిర్ణయిస్తారు. తానే స్వయంగా పట్టుకున్న యూసఫ్ ఖాన్ ను వదిలిపెట్టడం ఇష్టంలేని రవీంద్ర తన ప్రయత్నాలు తానూ చేస్తూనే ఉంటాడు. సరిగ్గా అప్పుడే జైలు నుండి తీసుకువస్తున్న యూసఫ్ ఖాన్ వాహనానికి ప్రమాదం జరిగి అతను మరణిస్తాడు. కానీ ఆ విషయాన్నీ నమ్మే పరిస్థితిలో టెర్రరిస్ట్‌లు సిద్దంగా లేరు. ఏమి చేయాలో అర్ధంకాని పరిస్థితులను తన అధినంలోకి తీసుకున్న రవీంద్ర తెలివిగా వ్యవహరించి ఆపరేషన్ 'గగనం' కు రూపకల్పన చేస్తాడు. ఇక అక్కడ నుండి ఆపరేషన్ 'గగనం' ఏవిధంగా విజయం సాధించింది అన్నది మిగిలిన కధ.
    **Note:Hey! Would you like to share the story of the movie గగనం with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X