X
గగనం

గగనం

Thriller | 11 Feb 2011 | U |
Telugu

2.7 /5 Users

2 /5 Filmibeat

గగనం స్టోరీ

గగనం సినిమా థ్రిల్లర్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అక్కినేని నాగార్జున, ప్రకాష్ రాజ్, పూనమ్ కౌర్, సనాఖాన్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాధామోహన్ నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ప్రవీణ్ మణి స్వరాలు సమకుర్చారు. కథ ఇక కధ విషయానికి వస్తే బిన్న నేపద్యాల నుండి వచ్చిన ప్రయాణికులు చెన్నై నుండి ఢిల్లీ వెళ్ళటానికి స్టార్ జెట్ అనే విమానం ఎక్కుతారు. బయలుదేరిన కొద్ది సమయానికే ఐదుగురు టెర్రరిస్ట్ లు విమానాన్ని హైజాక్ చేస్తారు. దాంతో తిరుపతిలో అత్యవసరంగా ల్యాండ్ అవుతుంది విమానం. 100 కోట్ల నగదు తో పాటు వారి నాయకుడు యూసఫ్ ఖాన్ ను కూడా విడుదల చేయాలి లేదంటే విమానంలో ఉన్న 100 మందిని చంపేస్తామని బెదిరిస్తారు. ఈ విషయం తో అలెర్ట్ అయిన ప్రభుత్వం వారితో చర్చలకు ప్రయత్నిస్తుంది. ఈ ప్రమాదం నుండి బయట పడటానికి నేషనల్ సెక్యూరిటీ చీఫ్ మేజర్ వి.రవీంద్ర(నాగార్జున)ను పిలిపిస్తారు. హోం సెక్రటరీ విశ్వనాధ్ (ప్రకష్ రాజ్) ను కమాండో యాక్షన్ కోసం అడుగుతాడు రవీంద్ర. కానీ విమానంలో ఓ కేంద్ర మంత్రి ఉండటం, రాబోయే మూడు నెలల్లో ఎలక్షన్లు ఉండటంతో అందుకు ప్రభుత్వం ఒప్పుకోదు. చివరికి చేసిది ఏమి లేక యూసఫ్ ఖాన్ ను విడుదల చేయటానికి నిర్ణయిస్తారు. తానే స్వయంగా పట్టుకున్న యూసఫ్ ఖాన్ ను వదిలిపెట్టడం ఇష్టంలేని రవీంద్ర తన ప్రయత్నాలు తానూ చేస్తూనే ఉంటాడు. సరిగ్గా అప్పుడే జైలు నుండి తీసుకువస్తున్న యూసఫ్ ఖాన్ వాహనానికి ప్రమాదం జరిగి అతను మరణిస్తాడు. కానీ ఆ విషయాన్నీ నమ్మే పరిస్థితిలో టెర్రరిస్ట్‌లు సిద్దంగా లేరు. ఏమి చేయాలో అర్ధంకాని పరిస్థితులను తన అధినంలోకి తీసుకున్న రవీంద్ర తెలివిగా వ్యవహరించి ఆపరేషన్ 'గగనం' కు రూపకల్పన చేస్తాడు. ఇక అక్కడ నుండి ఆపరేషన్ 'గగనం' ఏవిధంగా విజయం సాధించింది అన్నది మిగిలిన కధ.
Read More

గగనం కాస్ట్ & క్రూ

గగనం సిబ్బంది సమాచారం

దర్శకత్వం రాధా మోహన్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం ప్రవీణ్ మణి
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గగనం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంఫై దిల్ రాజు నిర్మించిన 'గగనం' చిత్రానికి ఆకాశమంత ఫేం రాధా మోహన్ దర్శకత్వం వహించాడు. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, పునంకౌర్, సనాఖాన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. పాటలు లేని ఈ సినిమాకు ప్రవీణ్ మణి నేపధ్య సంగీతాన్ని సమకూర్చారు. కే.వి.గుహన్ సినిమాటోగ్రఫీ అందించగా మార్తాండ్ .కె.వెంకటేష్ ఎడిటింగ్ నిర్వహించారు. పాటలు, ఫైట్లు, రొమాన్స్ వంటి కమర్షియల్ అంశాలు ఏమీ లేకుండా కధను నమ్మి నిర్మించిన ఓ ప్రయోగాత్మక చిత్రం అని చెప్పి సినిమా చూడటానికి ఏవిధమైన అంచనాలు పెట్టుకోకుండా రండి అని ప్రచారం చేసి మంచి ఫలితాలనే రాబట్టుకున్నారు నాగార్జున, దిల్ రాజు. ఇది ఒక మంచి చిత్రం, ఇక ఫై ప్రయోగాత్మక చిత్రాలు తెలుగులో రావటానికి నిజాయితితో చేసిన ప్రయత్నం అని నాగార్జున నమ్మకంగా చెప్పాడు.

గగనం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.7 /5 Your Rating

గగనం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+