నాని గ్యాంగ్ లీడర్ సినిమా హర్రర్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాని, కార్తికేయ, ప్రియాంక అరుళ్, మేఘా ఆకాష్, లక్ష్మి, శరణ్య, అనిష్ కురువిల్లా, ప్రియదర్శిని, రఘు బాబు, వెన్నేల కిశోర్, సత్య అక్కల తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకతం విక్రం కె కుమార్ వహించారు మరియు నిర్మాత లు నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందించారు.
కథ
తమ కుటుంబాలకు అన్యాయం చేసిన గుర్తు తెలియని వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సరస్వతి (లక్ష్మీ), వరలక్ష్మి (శరణ్య), ప్రియ (ప్రియాంక మోహన్)తో మొత్తం ఐదుగురు సిద్ధమవుతారు. ఆ క్రమంల పెన్సిల్ పార్థసారథి (నాని) అనే క్రైమ్, థ్రిల్లర్ రచయితను కలిసి తమ ప్లాన్ వివరిస్తే నిరాకరిస్తాడు. కానీ స్వప్రయోజనం కోసం మహిళా గ్యాంగ్ ప్లాన్ ఓకే చెబుతాడు. ఆ క్రమంలో అంబులెన్స్ డ్రైవర్ నుంచి అంతర్జాతీయ కారు రేసర్‌గా ఎదిగిన దేవ్ (కార్తీకేయ) తమకు అన్యాయం చేసిన వ్యక్తి అని గుర్తిస్తారు. కారు రేసర్ దేవ్ ఎందుకు ఐదుగురు కుటుంబాలను రోడ్డున పడేశాడు. 300 కోట్ల బ్యాంక్ దోపిడికి ఈ మహిళల కుటుంబాలకు సంబంధమేమిటి? బ్యాంక్ దోపిడికి అంబులెన్స్ డ్రైవర్ దేవకు సంబంధమేమిటి? ఇంటర్నేషనల్ రేసర్‌గా దేవ్ ఎలా మారాడు? గ్యాంగ్ లీడర్‌గా మారిన నాని ఐదుగురు మహిళల కోసం ప్రతీకారం ఎలా తీర్చుకొన్నాడు. ఐదుగురిలో ఒకరైన ప్రియతో ప్రేమలో పడిన పార్థసారథి తన లవ్‌ను గెలిచాడా? అనే ప్రశ్నలకు సమాధానమే Nani's గ్యాంగ్ లీడర్ కథ.