గీత సాక్షిగా మూవీ క్రైమ్, థ్రిల్లర్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆదర్శ్, చిత్రా శుక్లా శ్రీకాంత్ అయ్యంగార్, రూపేష్ శెట్టి, చరిష్మా, భరణి శంకర్, జయలలిత, అనితా చౌదరి, రాజా రవీంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. అంథోని మట్టిపల్లి దర్శకత్వం వహించారు. వెంకట్ హనుమ నారిశెట్టి సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి కిషోర్ మద్దాలి ఎడిటర్. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు.
కథ
మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువకుడు అర్జున్ (ఆదర్శ్), అమూల్య (చిత్రా శుక్లా)తో ప్రేమలో ఉంటూ సరదాగా జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉమెన్స్ హాస్టల్‌లో మనీషా అనే యువతి దారుణంగా అత్యాచారానికి గురై హత్యకు గురవుతుంది. మనీషా కేసులో అర్జున్‌ను సీఐ శంకర్ (భవానీ శంకర్) అరెస్ట్ చేస్తారు. మనీషా కేసులో జీవితకాలపు కారాగార శిక్షను కోర్టు మనీషా రేప్ అండ్ మర్డర్ కేసులో అసలేం జరిగింది? మనీషా కేసులో అర్జున్‌ను ఎందుకు సీఐ అరెస్ట్ చేశారు? నిజానికి మనీషా కేసుతో అర్జున్‌కు సంబంధం ఉందా? జీవితకాలపు కారాగార శిక్ష విధించిన తర్వాత మనీషా కేసును మళ్లీ ఎందుకు విచారించాల్సి వచ్చింది? అర్జున్ కోసం వాదించడానికి వచ్చిన లాయర్ ఎవరు? పేరు మోసిన లాయర్ జోసఫ్ (శ్రీకాంత్ అయ్యంగార్)ను ఎదిరించడానికి అర్జున్ పక్షాన నిలబడిన లాయర్ కేసు గెలిచిందా? మనీషా కేసులో అసలు దోషులు ఎవరు? అర్జున్‌ను నిందితుడా? నిరుపరాధా? అనే ప్రశ్నలకు సమాధానమే గీతసాక్షిగా సినిమా