X
ఘాజీ
Action | Thriller | 17 Feb 2017 |
Telugu

ఘాజీ స్టోరీ

ఘాజీ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ ఇది 1971లో మునిగిపోయిన పాకిస్థాన్ సబ్ మైరైన్ కథతో తెరకెక్కించారు ఇందులో నేవీ ఆఫీసర్ పాత్రలో రానా దగ్గుబాటి ఇంకా తాప్సీ పన్ను, కె కె మీనన్, అతుల్ కులకర్ణి, ఓంపురి, నాజర్, సత్యదేవ్, భరత్ రెడ్డి రాహుల్ సింగ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సంకల్ప్ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు "కె" స్వరాలు సమకుర్చరు.

కథ

1971లో ఇండియన్‌ సబ్‌మెరైన్‌ ఎస్‌ 21కీ.. పాకిస్థానీ జలంతర్గామి ఘాజీకీ మధ్య జరిగే వాటర్ వార్ ఈ కథ. పాకిస్థాన్ ఆర్మీ బంగ్లాదేశ్ (పశ్చిమ పాకిస్థాన్) లో పోరాడుతున్న తమ సైనికులకు సహాయం చేయడానికి కరాచీలో ఉన్న నేవల్ బేస్ నుండి బంగ్లాదేశ్ తీర ప్రాంతానికి ‘ఘాజి' అనే సబ్ మెరైన్ ను పంపుతుంది. ఆ సబ్ మెరైన్ భారతీయ జలాల గుండా వెళ్లి మాత్రమే బంగ్లాదేశ్ ను చేరుకోవాలి. కానీ ‘ఘాజి' బంగ్లాదేశ్ తీర ప్రాంతానికి వెళ్లే మధ్య దారిలో బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న భారతీయ జలాలకు ఇండియాకు చెందిన యుద్ధ వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కాపలా కాస్తుంటుంది. కనుక ముందు దాన్ని కూల్చి ఆ తర్వాత బంగ్లాదేశ్ చేరుకోవాలని ప్లాన్ వేస్తారు. కానీ అనుకోకుండా అప్పుడే ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సమాచారం తెలుసుకొన్న భారతీయ నేవీ భారతీయ జలాంతర్గామి ఎస్21 ను సముద్రంలోకి పంపుతుంది. దాంతో ‘ఘాజి' ముందుగా ఎస్ 21 ను ఎదుర్కోవాల్సి వస్తుంది, అందులో భాగాంగానే విశాఖపట్టణ ఓడరేవుని కూడా పేల్చేయాలని ప్లాన్ చేస్తుంది. అలా ఘాజీ వేస్తున్న ప్లాన్ లను ఇండియా యొక్క ఎస్ 21 ఎలా ఎదుర్కొంది? లెఫ్టినెంట్‌ కమాండర్‌ అర్జున్‌ (రానా).. కెప్టెన్‌ రణ్‌ విజయ్‌సింగ్‌ (కె.కె.మీనన్‌)లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి విశాఖపట్నం తీరాన్ని ఎలా కాపాడారు? 18 రోజుల పాటు నీటిలో జరిపిన పోరాటంలో పాక్‌ జలాంతర్గామి ఘాజీని ఎలా మట్టికరిపించారు? అనేదే కథ. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+