X
ఘాజీ

ఘాజీ

Action | Thriller | 17 Feb 2017 |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

ఘాజీ స్టోరీ

ఘాజీ సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ ఇది 1971లో మునిగిపోయిన పాకిస్థాన్ సబ్ మైరైన్ కథతో తెరకెక్కించారు ఇందులో నేవీ ఆఫీసర్ పాత్రలో రానా దగ్గుబాటి  ఇంకా తాప్సీ పన్ను, కె కె మీనన్, అతుల్ కులకర్ణి, ఓంపురి, నాజర్, సత్యదేవ్, భరత్ రెడ్డి  రాహుల్ సింగ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సంకల్ప్ రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు "కె" స్వరాలు సమకుర్చరు. కథ 1971లో ఇండియన్‌ సబ్‌మెరైన్‌ ఎస్‌ 21కీ.. పాకిస్థానీ జలంతర్గామి ఘాజీకీ మధ్య జరిగే వాటర్ వార్ ఈ కథ. పాకిస్థాన్ ఆర్మీ బంగ్లాదేశ్ (పశ్చిమ పాకిస్థాన్) లో పోరాడుతున్న తమ సైనికులకు సహాయం చేయడానికి కరాచీలో ఉన్న నేవల్ బేస్ నుండి బంగ్లాదేశ్ తీర ప్రాంతానికి ‘ఘాజి' అనే సబ్ మెరైన్ ను పంపుతుంది. ఆ సబ్ మెరైన్ భారతీయ జలాల గుండా వెళ్లి మాత్రమే బంగ్లాదేశ్ ను చేరుకోవాలి. కానీ ‘ఘాజి' బంగ్లాదేశ్ తీర ప్రాంతానికి వెళ్లే మధ్య దారిలో బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న భారతీయ జలాలకు ఇండియాకు చెందిన యుద్ధ వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కాపలా కాస్తుంటుంది. కనుక ముందు దాన్ని కూల్చి ఆ తర్వాత బంగ్లాదేశ్ చేరుకోవాలని ప్లాన్ వేస్తారు. కానీ అనుకోకుండా అప్పుడే ఇంటెలిజెన్స్ ద్వారా ఈ సమాచారం తెలుసుకొన్న భారతీయ నేవీ భారతీయ జలాంతర్గామి ఎస్21 ను సముద్రంలోకి పంపుతుంది. దాంతో ‘ఘాజి' ముందుగా ఎస్ 21 ను ఎదుర్కోవాల్సి వస్తుంది, అందులో భాగాంగానే విశాఖపట్టణ ఓడరేవుని కూడా పేల్చేయాలని ప్లాన్ చేస్తుంది. అలా ఘాజీ వేస్తున్న ప్లాన్ లను ఇండియా యొక్క ఎస్ 21 ఎలా ఎదుర్కొంది? లెఫ్టినెంట్‌ కమాండర్‌ అర్జున్‌ (రానా).. కెప్టెన్‌ రణ్‌ విజయ్‌సింగ్‌ (కె.కె.మీనన్‌)లు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి విశాఖపట్నం తీరాన్ని ఎలా కాపాడారు? 18 రోజుల పాటు నీటిలో జరిపిన పోరాటంలో పాక్‌ జలాంతర్గామి ఘాజీని ఎలా మట్టికరిపించారు? అనేదే కథ. 
Read More

ఘాజీ కాస్ట్ & క్రూ

ఘాజీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సంకల్ప్ రెడ్డి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం కె
నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఘాజీ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఈ సినిమాలో దాదాపు 90 శాతం సన్నివేశాలు కేవలం సబ్‌మెరైన్‌లోనే తీశారు. కంటికి సబ్‌ మెరైన్‌ తప్ప ఇంకేం కనిపించదు. తరవాతేం జరుగుతుందన్నటెన్షన్ ని ఎస్టాబ్లిష్ చేయటంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు. వాస్తవానికి మనదేశం పాకిస్థాన్‌పై విజయం సాధిస్తుందన్న సంగతి తొలి సన్నివేశంలోనే అర్థమైపోతుంది. కానీ ‘ఎలా' అనే ఆసక్తిని ప్రేక్షకుల్లో కలిగించడంలోనే డైరక్టర్ సక్సెస్ అయ్యారు. అయితే ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కథకు అవసరమైన ఎమోషన్ ను దర్శకుడు సరైన స్థాయిలో ప్రదర్శించలేకపోయాడనిపిస్తుంది. దీంతో సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకుడిని ఆకట్టుకోలేకపోయింది. సినిమా అంతా సముద్రం అడుగు భాగం జరుగుతుంది కనుక భారీ స్థాయి యుద్ధ సన్నివేశాలను ఆశించేవారికి నిరాశే. చివర్లో ...ఇండియన్ సబ్ మెరైన్ ఎస్ 21, పాకిస్థాన్ సబ్ మెరైన్ ‘ఘాజి' ని కూల్చే సన్నివేశాలు ఎక్సపెక్ట్ చేసిన స్దాయిలో లేవు. ఇంకాస్త వివరంగా చూపి ఉంటే బాగుండును అనిపిస్తుంది. అలాగే తాప్సి పాత్రకు ప్రయారిటీ లేదు. ఏదో ఉన్నామంటే ఉందంతే.. ఇలాంటి కథలను విజువలైజ్ చేయటం, తెరకెక్కించటం అనుకున్నంత ఈజీ కాదు. ముఖ్యంగా అతి తక్కువ పాత్రలతో.. వార్ సీన్స్ తో అంతసేపు కదలకుండా కూర్చోబెట్టడం.. టైట్ స్క్రీన్‌ప్లేతోనే సాధ్యమైంది.

ఘాజీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఘాజీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+