గౌరవం సినిమా డ్రామ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు శిరీష్, యామి గౌతమి, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాధా మోహర్ నిర్వహించారు మరియు నిర్మాత ప్రకాష్ రాజ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ థమన్ స్వరాలు సమకుర్చారు.
కథ
కథాంశంలోకి వెళితే అర్జున్ (శిరీష్) సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తి. విలాసంగా జీవించే అర్జున్ తండ్రి వ్యాపారానికి సంబంధించిన పనితో పాటు, తన స్నేహితుడు శంకర్‌ను కలిసేందుకు ఎస్.ఎమ్ పల్లి అనే గ్రామానికి వెళతాడు. అక్కడికి వెళ్లిన అర్జున్ తన స్నేహితుడు ఊర్లో లేక పోవడంతో ఆరా తీయగా ఆ ఊరి భూస్వామైన పశుపతి(ప్రకాష్) కూతురిని శంకర్ తీసుకుని లేచిపోయాడని తెలుస్తుంది. అతని ఆచూకి ఎంత ప్రయత్నించినా దొరకదు. అదే సమయంలో అర్జున్‌కి పశుపతి మనుషుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయి. దీంతో స్నేహితుడు ఆపదలో ఉన్నాడనే విషయం తెలుసుకుంటాడు. అతని చూకి కోసం ఆరా తీస్తుంటాడు. శంకర్ తల్లిదండ్రులను కలిసి జరిగిన నిజాలను తెలుసుకుంటాడు. ఈ క్రమంలో అర్జున్ కి సహాయంగా నిలుస్తుంది లాయర్ యామిని(యామి గౌతం). మరి అర్జున్ తన స్నేహితుడి ఆచూకీ కనుక్కోవడానికి ఏంచేసాడు, పశుపతి మనుషులను ఎలా ఎదుర్కొన్నారు, పశుపతి కూతురితో లేచి పోయి శంకర్ ఏమయ్యాడు అనే విషయాలు థియేటర్లో చూడాల్సిందే.