గోవిందుడు అందరివాడేలే సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులోరామ్ చరణ్ తేజ్, కాజల్ అగర్వాల్, శ్రీ కాంత్, కమలినీ ముఖర్జీ, ప్రకాష్‌రాజ్, ఎం.ఎస్.నారాయణ, పరుచూరి వెంకటేశ్వరరావు, రఘుబాబు, పోసాని తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈసినిమాకు కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కృష్ణవంశీ నిర్వహించారు, నిర్మాత: బండ్ల గణేష్ నిర్మించారు. సంగీతదర్శకుడు యువన్‌శంకర్‌రాజా స్వరాలు అందించారు.
కథ
ఊరి పెద్ద బాలరాజు(ప్రకాష్ రాజ్) ఊరు బాగుంటే అంతా బాగుంటుందని నమ్మే వ్యక్తి. అందుకే తన పెద్ద కొడుకు చంద్రశేఖర్(రహమాన్)ను డాక్టర్ చదివించి ఊరిలోనే ఆసుపత్రి కట్టించి ప్రజలకు వైద్యం అందించాలని ఆశిస్తాడు. అయితే చంద్రశేఖర్ తండ్రిమాట పట్టించు కోకుండా విదేశాలు, డబ్బుపై మోజుతో తను ప్రేమించిన అమ్మాయి(బానుశ్రీ మెహ్రా)తో లండన్ వెళ్లి పోతాడు.
తండ్రి మాటను కాదని తను చేసిన తప్పును తలచుకుని కుమిలిపోతున్న చంద్రశేఖర్ రావును తన ఫ్యామిలీతో కలిపే ప్రయత్నంలో లండన్ నుండి ఇండియా వస్తాడు అభిరామ్(రామ్ చరణ్). తను ఎవరో చెప్పకుండా బాలరాజు కుటుంబానికి దగ్గరవుతాడు. తండ్రిని, తాతను అభిరామ్ ఎలా కలిపాడు అనేది క్లైమాక్స్.