గ్రీకువీరుడు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, నయనతార, మీరాచోప్రా, కె.విశ్వనాథ్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, అలీ, వేణుమాధవ్, రఘుబాబు, వెన్నెల కిషోర్, నాగినీడు, భరత్‌రెడ్డి, తాగుబోతు రమేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ-దర్శకత్వం: దశరథ్ నిర్వహించారు మరియు నిర్మాత డి శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు థమన్ స్వరాలు సమకుర్చరు.
కథ
అమెరికాలో పుట్టిన పెరిగిన చందు (నాగార్జున) ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థను నిర్వహిస్తూంటాడు . ప్రేమ , అనుభంధాలకు విలువ ఇవ్వని ప్లే బోయ్ చందు పై బిజినెస్ పరంగా ఓ కేసు పడి...అందులోంచి బయిటపడటానికి డబ్బు అవసరమై, ఇండియాలో ఉన్న తన కుటుంబ ఆస్ధిని తెచ్చుకోవటానికి వస్తాడు. ఈ ట్రిప్ లో అతనికి బంధాలు,అనుబంధాలకు ప్రాణమిస్తూ 'మేకే ఎ విష్ పౌండేషన్' లో పనిచేస్తూండే సంధ్య (నయనతార) తారసపడుతుంది. ఇంటికి వెళ్లిన చందు..అనుకోని పరిస్దితుల్లో తన తాత,అత్తయ్యలకు సంధ్యను...తన భార్యగా పరిచయం చేయాల్సి వస్తుంది. అందుకు ఆమెను ఒప్పించిన చందు అక్కడితో ఆ రిలేషన్ పూర్తై పోతుందనుకుంటాడు. కానీ ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అప్పుడేం జరిగింది..చందు ఒరిజనల్ క్యారెక్టర్ తెలుసుకున్న సంధ్య అతనితో జీవితం పంచుకోవటానికి ఒప్పుకుందా వంటి విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.