X
తెలుగు » సినిమాలు » గ్రీకువీరుడు
గ్రీకువీరుడు

గ్రీకువీరుడు

Romance | 03 May 2013 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

గ్రీకువీరుడు స్టోరీ

గ్రీకువీరుడు సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, నయనతార, మీరాచోప్రా , కె.విశ్వనాథ్‌, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, కోట శ్రీనివాసరావు, శరత్‌బాబు, అలీ, వేణుమాధవ్‌, రఘుబాబు, వెన్నెల కిషోర్‌, నాగినీడు, భరత్‌రెడ్డి, తాగుబోతు రమేష్‌ తదితరులు నటించారు. ఈ సినిమాకి కథ-దర్శకత్వం: దశరథ్ నిర్వహించారు మరియు నిర్మాత డి శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు థమన్ స్వరాలు సమకుర్చరు. కథ అమెరికాలో పుట్టిన పెరిగిన చందు (నాగార్జున) ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థను నిర్వహిస్తూంటాడు . ప్రేమ , అనుభంధాలకు విలువ ఇవ్వని ప్లే బోయ్ చందు పై బిజినెస్ పరంగా ఓ కేసు పడి...అందులోంచి బయిటపడటానికి డబ్బు అవసరమై, ఇండియాలో ఉన్న తన కుటుంబ ఆస్ధిని తెచ్చుకోవటానికి వస్తాడు. ఈ ట్రిప్ లో అతనికి బంధాలు,అనుబంధాలకు ప్రాణమిస్తూ 'మేకే ఎ విష్ పౌండేషన్' లో పనిచేస్తూండే సంధ్య (నయనతార) తారసపడుతుంది. ఇంటికి వెళ్లిన చందు..అనుకోని పరిస్దితుల్లో తన తాత,అత్తయ్యలకు సంధ్యను...తన భార్యగా పరిచయం చేయాల్సి వస్తుంది. అందుకు ఆమెను ఒప్పించిన చందు అక్కడితో ఆ రిలేషన్ పూర్తై పోతుందనుకుంటాడు. కానీ ఆమెతో ప్రేమలో పడిపోతాడు. అప్పుడేం జరిగింది..చందు ఒరిజనల్ క్యారెక్టర్ తెలుసుకున్న సంధ్య అతనితో జీవితం పంచుకోవటానికి ఒప్పుకుందా వంటి విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
Read More

గ్రీకువీరుడు కాస్ట్ & క్రూ

గ్రీకువీరుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం దశరథ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం తమన్ యస్
నిర్మాత డి శివప్రసాద్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గ్రీకువీరుడు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
క్లాసిక్ నేరేషన్ లో చెప్పిన ఈ చిత్రం కథని...ఫీల్ గుడ్ సినిమాలా ప్యామీలీ ఎంటర్టైనర్ గా మార్చాలన్న దర్శకుడు తాపత్రయం ప్రతీ చోటా కనపడుతుంది. అయితే దర్శకుడు ప్రస్తుతం కామెడీ ట్రెండ్ నడుస్తోంది,లేకపోతే చూడరు అనుకున్నాడో ఏమోకానీ...కథమీద కన్నా కామెడీ క్యారెక్టర్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టాడు. అయితే ఆ పాత్రలు ఊహించినంత కిక్ ఇవ్వలేకపోయాయి. ముఖ్యంగా కథలో కామెడీ సిట్యువేషన్స్ పెద్దగా లేకపోవటంతో... అవి కావాలని పెట్టిన పాత్రలుగానే మిగిలిపోయాయి. సంతోషం సినిమాలా పూర్తిగా ఫీల్ గుడ్ తరహాలో దశరథ్ తీసి ఉంటే ఓ వర్గం అయినా పూర్తిగా సంతృప్తి చెందేది.

గ్రీకువీరుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

గ్రీకువీరుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+