గుండెల్లో గోదారి సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆది పనిశెట్టి, తాప్సీ, మంచు లక్ష్మి, సుదీప్ కిషన్, మురళీ మోహన్, రవిబాబు, జీవా, అన్నపూర్ణ, తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఈసినిమాకి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కుమార్ నాగేంద్ర నిర్వహించారు మరియు మంచు ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవెట్ లిమిటెడ్ పతాకం మంచు లక్ష్మి నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చారు.
కథ
చేపలు పట్టుకు బ్రతికే మల్లి(ఆది), స్లమ్ ఏరియాకు చెందిన చిత్ర(మంచు లక్ష్మి ప్రసన్న) వివాహం జరుగుతున్న సమయంలో గోదావరి ఒడ్డున ఉన్న ఆ గ్రామాన్ని వరదలు ముంచెత్తుతాయి. వీరిద్దరూ ప్రాణాలు దక్కించుకోవటానికి ఓ గడ్డివాము మీదకు చేరుతారు. ప్రాణాలు ఉంటాయో.. పోతాయో తెలియని ఆ స్ధితిలో తమ గురించిన నిజాలు ఒకరికొకరు చెప్పుకోవాలని నిర్ణయించుని తమ గతాన్ని ఆవిష్కరించుకుంటారు. ఇంతకూ ఆ గతం ఏమిటి... చివరకు వీరిద్దరూ బ్రతికి బయిటపడ్డారా.. సినిమాలో సందీప్, తాప్సీ పాత్రలు ఏమిటి అన్న విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.