గురు సినిమా తమిళ హిందీ భాషల్లో ఘనవిజయం సాధించిన సాలా ఖద్దూస్ సినిమాను తెలుగు రీమేక్ చేస్తుస్తున్నారు...ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాక్సింగ్ కోచ్‌గా వెంకటేష్ మరియు శిష్యురాలిగా రితికా సింగ్, తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సుధ కొంగర ప్రసాద్ నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత యస్ శశికాంత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరాలు సమకుర్చరు.
కథ
ఆది (వెంకటేష్)కి బాక్సింగ్ అంటే ప్రాణం. ఆవేశం, దూకుడుతనం అతని నైజం. బాక్సింగ్ అకాడమీలో రాజకీయాల వల్ల తాను అనుకొన్న ఒలంపిక్ పతకం చేజారుతుంది. అకాడమీ ప్రెసిడెంట్ తీరు వల్ల కోచ్‌గా కూడా ఆదికి అనేక సమస్యలు ఎదురవుతాయి. బాక్సింగ్ క్రీడకు ఆదరణ లేని విశాఖపట్నానికి మహిళల బాక్సింగ్ కోచ్‌గా అకాడమీ ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. విశాఖలో రామేశ్వరి అలియాస్ రాముడు అలియాస్ రాముడు (రితికా సింగ్) ఆది దృష్టిని ఆకర్షిస్తుంది. రామేశ్వరి కూరగాయలు అమ్ముకొంటూ కుటుంబ భారాన్ని మోస్తుంది. అక్క లక్స్ పాప (ముంతాజ్ సర్కార్) బాక్సింగ్ క్రీడలో రాణించి పోలీసు ఉద్యోగం సంపాదించేందుకు తన శక్తి మేరకు సహాయపడుతుంటుంది. రామేశ్వరిలో ఉండే సహజసిద్ధమైన బాక్సింగ్ నైపుణ్యం ఆదిని కట్టిపడేస్తుంది. రామేశ్వరిని మంచి బాక్సర్ తీర్చిదిద్ది తాను సాధించలేని లక్ష్యాన్ని ఆమె ద్వారా కలను సాకారం చేసుకోవాలనుకుంటాడు. రామేశ్వరిని ఆది ఎలా ఛాంపియన్‌గా తయారు చేశాడు. ఆ నేపథ్యంలో ఆదికి ఎదురైన సవాళ్లు ఏంటి? అకాడమీ రాజకీయాలను ఎలా ఎదురించాడు. ఇంతకి రామేశ్వరి వరల్డ్ చాంఫియన్ అయిందా అనే ప్రశ్నలకు సమాధానం గురు చిత్రం.