X
గురు

గురు

Action | 31 Mar 2017 | U |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

గురు స్టోరీ

గురు సినిమా తమిళ హిందీ భాషల్లో ఘనవిజయం సాధించిన సాలా ఖద్దూస్ సినిమాను తెలుగు రీమేక్ చేస్తుస్తున్నారు...ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో బాక్సింగ్ కోచ్‌గా వెంకటేష్ మరియు శిష్యురాలిగా రితికా సింగ్ , తదితరులు ముఖ్యపాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సుధ కొంగర ప్రసాద్ నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత యస్ శశికాంత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సంతోష్ నారాయణన్ స్వరాలు సమకుర్చరు. కథ ఆది (వెంకటేష్‌)కి బాక్సింగ్‌ అంటే ప్రాణం. ఆవేశం, దూకుడుతనం అతని నైజం. బాక్సింగ్‌ అకాడమీలో రాజకీయాల వల్ల తాను అనుకొన్న ఒలంపిక్ పతకం చేజారుతుంది. అకాడమీ ప్రెసిడెంట్ తీరు వల్ల కోచ్‌గా కూడా ఆదికి అనేక సమస్యలు ఎదురవుతాయి. బాక్సింగ్ క్రీడకు ఆదరణ లేని విశాఖపట్నానికి మహిళల బాక్సింగ్‌ కోచ్‌గా అకాడమీ ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. విశాఖలో రామేశ్వరి అలియాస్ రాముడు అలియాస్ రాముడు (రితికా సింగ్‌) ఆది ద‌ృష్టిని ఆకర్షిస్తుంది. రామేశ్వరి కూరగాయలు అమ్ముకొంటూ కుటుంబ భారాన్ని మోస్తుంది. అక్క లక్స్ పాప (ముంతాజ్ సర్కార్) బాక్సింగ్ క్రీడలో రాణించి పోలీసు ఉద్యోగం సంపాదించేందుకు తన శక్తి మేరకు సహాయపడుతుంటుంది. రామేశ్వరిలో ఉండే సహజసిద్ధమైన బాక్సింగ్ నైపుణ్యం ఆదిని కట్టిపడేస్తుంది. రామేశ్వరిని మంచి బాక్సర్ తీర్చిదిద్ది తాను సాధించలేని లక్ష్యాన్ని ఆమె ద్వారా కలను సాకారం చేసుకోవాలనుకుంటాడు. రామేశ్వరిని ఆది ఎలా ఛాంపియన్‌గా తయారు చేశాడు. ఆ నేపథ్యంలో ఆదికి ఎదురైన సవాళ్లు ఏంటి? అకాడమీ రాజకీయాలను ఎలా ఎదురించాడు. ఇంతకి రామేశ్వరి వరల్డ్ చాంఫియన్ అయిందా అనే ప్రశ్నలకు సమాధానం గురు చిత్రం.
Read More

గురు కాస్ట్ & క్రూ

గురు సిబ్బంది సమాచారం

దర్శకత్వం సుధా కొంగర
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సంతోష్ నారాయణన్
నిర్మాత యస్ శశికాంత్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

గురు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఇటీవల దంగల్, సుల్తాన్ లాంటి క్రీడా నేపథ్యం ఉన్న చిత్రాలకు ముందే సాలా ఖడూస్ వచ్చినా వాటంతటి ప్రాచుర్యం పొందలేదు. కానీ విమర్శకులను ఆ చిత్రం ఆలోచింపజేసేలా చేసింది. సాలా ఖడూస్ చిత్రం ఓ వర్గం ప్రేక్షకులను విశేషంగా ఆకర్షించింది. తమిళంలోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకొన్నది. ఈ క్రమంలో హీరోయిజంను పక్కన పెట్టి వయసుకు తగిన పాత్రను చేయాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో విక్టరీ వెంకటేస్ ధృష్టిని ఆకర్షించిన చిత్రం మిది. గత చిత్రాలకు భిన్నంగా తన లుక్స్, బాడీలాంగ్వేజ్‌ను ఆసాంతం మార్చుకొని వెంకటేష్ ఆది పాత్రలో పరకాయ ప్రవేశం చేసేలా దర్శకురాలు సుధా కొంగర చేసిన ప్రయత్నం సఫలమైందనే చెప్పవచ్చు. పాత్ర పరిధి మేరకు కనిపించాల్సిన కసి, ఆవేశం, దూకుడుతనాన్ని సమపాళ్లలో చూపించడం వల్ల చిత్రంపై ప్రేక్షకుడి ఆసక్తి మరింత పెంచింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎమోషన్‌కు గురిచేసేలా ఉన్నాయి. ఈ చిత్రంలో అమ్మాయిలపై కోచ్‌ల దౌర్జన్యం, లైంగిక వేధింపులు దర్శకురాలు సుధ కళ్లకు కట్టినట్టు చూపించారు. అలాంటి వ్యక్తులు క్రీడా రంగంలో ఉంటే ఇలాంటి చిత్రాలు రావడం వల్ల కొంత తమ ప్రవర్తను మార్చుకొనేందుకు సహాయపడుతాయి. కానీ ఎవరైనా తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల్లో చేర్పించాలనుకుంటే వారిని భయపెట్టే విధంగా ఉన్నదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

గురు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

గురు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+