హిట్ 2 సినిమా క్రైమ్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అడివి శేష్, మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం డా శైలేష్ కొలను వహించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. సంగీతం జాన్ స్టీవర్ట్ ఏడురి అందించారు.
కథ
కృష్ణదేవ్ అలియాస్ కేడీ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్. ఎలాంటి మర్డర్ కేసునైనా క్షణాల్లో తేల్చేసే సత్తా ఉన్న ఆఫీసర్‌కు సంజన అనే యువతితోపాటు మరో ముగ్గురి హత్యా సంఘటన తన ప్రతిభకు ఛాలెంజ్ విసురుతుంది. సంజన మర్డర్ కేసు విచారణ కొనసాగుతున్న ఓ సమయంలో సస్పెన్షన్‌కు గురి అవుతాడు. సంజనతోపాటు మరో ముగ్గురి హత్య వెనుక కారణం ఏమిటి? హంతకుడిని పట్టుకోవడంలో కృష్ణదేవ్ వేసిన తప్పటడుగు ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది. సంజన హత్య కేసులో రంగడు అనే అనుమానితుడు ఎలా బలిపశువు అయ్యాడు. సంజన హత్యకు కారణమైన సీరియల్ కిల్లర్ ఎవరు? కృష్ణదేవ్ లవర్ ఆర్య (మీనాక్షి చౌదరీ)ని కిల్లర్ ఎందుకు టార్గెట్ చేశాడు? సస్పెన్షన్ తర్వాత హంతకుడిని కేడీ ఎలా పట్టుకొన్నాడు? అనే ప్రశ్నలకు సమాధానమే హిట్ 2 సినిమా కథ.