హృదయ కాలేయం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంపూర్ణేస్వర్ బాబు, కావ్య కుమార్, ఇషిక సింగ్, మహెష్ కతి, రాజేష్ సొమెపల్లి, క్రిష్ణ అదిత్య, సాయి రాజేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం స్టీవెన్ శంకర్ నిర్వహించారు మరియు నిర్మాత సాయి రాజేష్ నీలం నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ఆర్ కె మరియు శ్రీకాంత్ పెంద్యల స్వరాలు సమకుర్చారు.
కథ
సంపూర్ణేష్ బాబు (సంపూర్ణేష్ బాబు) ఓ అనాధ. ఎలక్ట్రీషియన్ పని చేసే అతను ఏ టు జెడ్ అని ఒకసంస్థను స్థాపించి అందరికి సహాయపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో నీలవేణి (కావ్య కుమార్) అనే అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. నీలుపై ప్రేమ పెంచుకుంటాడు. నీలుకు ఈ విషయం చెప్పగా అమె ఓ కండీషన్ పెడుతుంది. నాకు అసాధ్యాన్ని సుసాధ్యం చేసే 100% మగాడు కావాలి, అలాంటి వాడినే పెళ్లాడుతానని చెప్పడంతో తనను తాను నిరూపించుకునే ప్రయత్నం మొదలు పెడతాడు.
ఇందులో భాగంగా సంపూర్నేష్ బాబు ఎలాగయినా రూ. 500 లకే కంప్యూటర్ తయారు చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. అలా "నీలు సంప్యుటర్" తయారు చేస్తాడు ఆ ఫార్ములా కోసం కొందు చేసిన దాడిలో నీలవేణి గాయపడుతుంది. నీలవేణి హృదయం చెడిపోయింది అని కృత్రిమ గుండె అమర్చాలని డాక్టర్స్ చెప్పగా ఖరీదయిన హృదయానికి బదులు తనే ఒక కృత్రిమ హృదయాన్ని తయారు చెయ్యాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో సంపూర్ణేష్ బాబు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు? హృదయ కాలేయం అనే టైటిల్‌కి దర్శకుడు న్యాయం చేసాడా? అనేది తెరపై చూడాల్సిందే.