ఇద్దరమ్మాయిలతో సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, అమలాపాల్, కేథరిన్ ,బ్రహ్మానందం, నాజర్, అలీ, సుబ్బరాజు, శ్రీనివాసరెడ్డి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ,మాటలు, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: పూరి జగన్నాథ్ నిర్వహించారు మరియు నిర్మాత బండ్ల గణేష్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవిశ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు.
కథ
స్పెయిన్ లో సంజు రెడ్డి(అల్లు అర్జున్) గిటారిస్ట్ ఉంటూ బ్యాండ్ మెయింటైన్ చేస్తూంటాడు. అక్కడికి పై చదువు నిమిత్తం వచ్చిన ఆకాంక్ష(కేధరిన్) కి తను రెంట్ కి దిగిన రూమ్ లో ఓ డైరీ దొరుకుతుంది. ఆ డైరి అంతకుముందు ఆ గదిలో ఉన్న టెనెంట్ కోమలి శంకరాభరణం(అమలా పాల్)ది. ఎంతో ఆసక్తిగా ఆ డైరీ తిరగేసిన ఆకాంక్షకు అందులో సంజు,కోమలిల లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ చదువుతూ...ఫాలో అవుతూ బయిట ఆమె సంజుని పరిచయం చేసుకుంటుంది...అతి త్వరలోనే అతనితో ప్రేమలో పడిపోతుంది. అంతేకాదు ఆ లవ్ స్టోరీ లో ఉన్న ట్విస్ట్ కు షాక్ అవుతుంది. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటి...సంజు ...ఈ ఇద్దరమ్మాయిల్లో ఎవరిని ఏక్సెప్ట్ చేసాడనేది మిగతా కథ.