twitter

    ఇదే మా కథ స్టోరి

    ఇదే మా కథ సినిమా అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో శ్రీకాంత్, సుమంత్ అశ్విన్, తన్య హోప్, భూమిక, సప్తగిరి, ఆటో రామ్ ప్రసాద్, సమీర్, శ్రీకాంత్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గురు పవన్ అందించారు. నిర్మాత మహేష్ గొల్ల నిర్మించారు. సంగీతం సునీల్ కశ్యప్ అందించారు. 

    కథ 
    మహేంద్ర (శ్రీకాంత్) బైక్ రైడర్. చావు బతుకులతో పోరాడుతూ పాతికేళ్ల క్రితం ప్రేమకు దూరమైన ఆయన లద్దాఖ్‌కు బయలుదేరుతాడు. లక్ష్మీ (భూమిక) సాధారణ గృహిణి. మోటార్ రంగంలో కొత్త ఆవిష్కరణలు సాధించాలనే లక్ష్యం ఉన్న తన తండ్రి కోరికను భుజాన వేసుకొని, భర్తను కూడా ఎదురించి లక్ష్మీ లద్దాఖ్‌ బయలుదేరుతుంది. ప్రాణాల తెగించి సాహసం చేసే అజయ్ బైక్ రైడర్ (సుమంత్ అశ్విన్) ఛాంపియన్ షిప్ సాధించాలని లద్దాఖ్ బయలు దేరుతాడు. ప్రేమ పేరుతో మోసానికి గురైన మేఘన (తాన్యా హోప్) తన బైక్ రైడింగ్ ప్యాషన్‌ కోసం లద్దాక్ బయలుదేరుతుంది. బైక్ రైడర్ మహేంద్ర జీవితంలో పాతికేళ్ల క్రితం లద్దాఖ్‌లో ఏం జరిగింది? చావు బతుకుల మధ్య మహేష్ లద్దాఖ్‌కు ఎందుకు బయలుదేరాడు? రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కు లక్ష్ీమ ఎలాంటి ఆవిష్కరణలు చేపట్టింది? బైక్ రైడింగ్‌లో ఛాంపియన్ కావాలని కలలు కన్న అజయ్‌కి ఎదురైన సవాళ్లు ఏమిటి? ప్రియుడి చేతిలో మేఘన ఎలా వంచన గురైంది. మేఘనను ఇష్టపడిన అజయ్ ప్రేమ ఫలించిందా? అనే ప్రశ్నలకు సమాధానమే ఇదే మా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie ఇదే మా కథ with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X