X
ఇంకొక్కడు
Action | Thriller | 08 Sep 2016 | U/A | 156 Mins
Telugu

ఇంకొక్కడు స్టోరీ

ఇంకొక్కడు సినిమా తమిళ 'ఇరుముగన్‌' అనే సినిమా తెలుగు వర్షన్ లో 'ఇంకొక్కడు' అనే టైటిల్‌ తో  వస్తోంది. ఇది యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విక్రమ్‌, నయనతార, నిత్యామేనన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఆనంద్ శంకర్ నిర్వహించారు మరియు థమీన్స్‌ ఫిల్మ్స్‌ పతాకంపై శిబు థమీన్స్‌ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హరిస్ జైరాజ్ స్వరాలు సమకుర్చరు. 

కథ

లవ్ (విక్రమ్) ఓ కెమెకిల్ సైంటిస్ట్. అతను 'స్పీడ్'అనే ఓ డ్రగ్‌ను కనిపెట్టి,దాన్ని టెర్రరిస్ట్ లకు అమ్మేసే ఆలోచనలో ఉంటాడు. ఇంతకీ స్పీడ్ ఏం చేస్తుందయ్యా అంటే...దాన్ని తీసుకుంటే ఓ ఐదు నిముషాల పాటు మనిషికి అదిరిపోయే శక్తి వస్తుంది. ఆ డ్రగ్ తీసుకున్న ఓ 70 సంవత్సరాల ముసలాడు...ఇండియన్ ఎంబసీ మీద దాడి చేసి, ఓ ఇరవై మంది ఇండియన్ పోలీసులను చంపేస్తాడు. ముసలాడిలో సైతం అనంతమైన శక్తి వచ్చే.. అంత పరవ్ ఫుల్ డ్రగ్ టెర్రరిస్ట్ ల చేతికి వెళితే ఇంకేమైనా ఉందా... అందుకే ఆ డ్రగ్ ని ఆపాలని ఇండియన్ ఇంటిలిజెన్స్ సంస్ద రంగంలోకి దిగుతుంది. వాళ్లు లవ్‌ను పట్టుకునేందుకు ఇండియన్ ఇంటిలిజెన్స్ సంస్థ అఖిల్ (విక్రమ్) అనే ఓ సస్పెండ్ అయిన అధికారిని పిలుస్తారు. ఎందుకంటే అఖిల్‌కి మాత్రమే లవ్‌కి సంబంధించిన చాలా విషయాలు తెలుసని వాళ్లకు తెలుసు. దాంతో ఇంటిలిజెన్స్ సంస్థ లవ్‌ని పట్టుకునేందుకు అఖిల్‌కి అన్ని అధికారాలూ ఇస్తుంది. గతంలో ఆ సైంటిస్ట్ విలన్ ..లవ్ కారణంగానే తన భార్య మీరా (నయనతార) ను పొగొట్టుకున్న అఖిల్, లవ్ ను నాశనం చేయాలనే నిర్ణయించుకుంటాడు. మరో రా ఆఫీసర్ ఆరుషి(నిత్యామీనన్)తో కలిసి మలేషియాలో అడుగుపెట్టిన అఖిల్ అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు.అసలు అఖిల్‌కి, లవ్‌కి ఉన్న సంబంధం ఏంటి? చివరకు లవ్ కథను ఎలా ముగించాడు,అతన్ని పట్టుకునేందుకు ఏం చేసాడు అన్నదే మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+