ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా కామిడి రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, కృతిక జయకుమార్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి, చలపతి రావు, శ్రీనివాస రెడ్డి, శకలక శంకర్, చమ్మక్ చంద్ర, ప్రభాస్ శ్రీను, ధన్ రాజ్, తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నాగేశ్వర రెడ్డి జి నిర్వహించారు మరియు నిర్మతలు బి వి ఎన్ ఎస్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చురు.
కథ
ఓ పెద్ద భవంతి..అందులో కాపురం పెట్టిన ఓ దెయ్యం. ఆ భవంతి గురించి తెలియని రాజేంద్రప్రసాద్ దాన్ని కొనేస్తాడు. కొంతకాలం మామూలుగా గడిచినా రోజు తన ఇంట్లో దెయ్యం ఉందని రాజేంద్రప్రసాద్ కి తెలిసిపోతుంది. మరో ప్రక్క బ్యాండ్ మేళం నడుపుతూంటాడు నరేష్ (అల్లరి నరేష్). అతనికో లవర్ ఇందుమతి (కృతిక జయకుమార్). అనుకోకుండా నరేష్ అప్పుల్లో ఇరుక్కుంటాడు. ఆ అప్పు తీర్చేందుకు డబ్బు కోసం మార్గాలు అన్వేషిస్తూండగా అతనికో అవకాసం వస్తుంది. ఓ రోజు ...దెయ్యం పెట్టే బాధలు పడలేక..రాజేంద్రప్రసాద్ ...వాటిని పాలత్రోలే ఓ భూత మాంత్రికుడుకి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ పొరపాటున నరేష్ కు కనెక్ట్ అయ్యి వచ్చేస్తాడు. అయితే ఆ విషయం ఆ ఇంటికి వచ్చేదాకా తెలియదు. వచ్చాక డబ్బు కు ఆశపడి తన వృత్తి కాకపోయినా దెయ్యాన్ని పాలదోలతానికి , దెయ్యాల తోలే మాంత్రికుడుని అని చెప్పి కమిటవతాడు. డబ్బు కోసం ఆ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని తరిమికొడతానని 10 లక్షలకు కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఆ ఇంట్లో ఎంట్రీ ఇచ్చాక నరష్ అక్కడే ఇరుక్కుపోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. ఈ లోగా దెయ్యం...ఈ నకిలీ భూతవైద్యుడుతో ఆడుకోవటం మొదలెడుతుంది. ఈ లోగా దెయ్యానికి నరేష్ కు లింక్ ఉందని రివీల్ అవుతుంది. అలాంటి క్లిష్టమైన పరిస్దితుల్లో నరేష్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ? దెయ్యానికి నరేష్ ప్రేమించిన అమ్మాయికి ఉన్న సంబంధం ఏమిటి ? నరేష్ తన ప్రేమను ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది ? చివరకు ఈ కథ ఎలా మలుపులు తిరిగి ఎలా ముగిసింది ? అన్నదే ఈ సినిమా స్టోరీ.