X
తెలుగు » సినిమాలు » ఇంట్లో దెయ్యం నాకేం భయం
ఇంట్లో దెయ్యం నాకేం భయం

ఇంట్లో దెయ్యం నాకేం భయం

Comedy | Romance | 30 Dec 2016 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

ఇంట్లో దెయ్యం నాకేం భయం స్టోరీ

ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా కామిడి రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, కృతిక జయకుమార్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి, చలపతి రావు, శ్రీనివాస రెడ్డి, శకలక శంకర్, చమ్మక్ చంద్ర, ప్రభాస్ శ్రీను, ధన్ రాజ్, తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నాగేశ్వర రెడ్డి జి నిర్వహించారు మరియు నిర్మతలు బి వి ఎన్ ఎస్ ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చురు. కథ ఓ పెద్ద భవంతి..అందులో కాపురం పెట్టిన ఓ దెయ్యం. ఆ భవంతి గురించి తెలియని రాజేంద్రప్రసాద్ దాన్ని కొనేస్తాడు. కొంతకాలం మామూలుగా గడిచినా రోజు తన ఇంట్లో దెయ్యం ఉందని రాజేంద్రప్రసాద్ కి తెలిసిపోతుంది. మరో ప్రక్క బ్యాండ్ మేళం నడుపుతూంటాడు నరేష్ (అల్లరి నరేష్). అతనికో లవర్ ఇందుమతి (కృతిక జయకుమార్). అనుకోకుండా నరేష్ అప్పుల్లో ఇరుక్కుంటాడు. ఆ అప్పు తీర్చేందుకు డ‌బ్బు కోసం మార్గాలు అన్వేషిస్తూండగా అతనికో అవకాసం వస్తుంది. ఓ రోజు ...దెయ్యం పెట్టే బాధలు పడలేక..రాజేంద్రప్రసాద్ ...వాటిని పాలత్రోలే ఓ భూత మాంత్రికుడుకి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ పొరపాటున నరేష్ కు కనెక్ట్ అయ్యి వచ్చేస్తాడు. అయితే ఆ విషయం ఆ ఇంటికి వచ్చేదాకా తెలియదు. వచ్చాక డబ్బు కు ఆశపడి తన వృత్తి కాకపోయినా దెయ్యాన్ని పాలదోలతానికి , దెయ్యాల తోలే మాంత్రికుడుని అని చెప్పి కమిటవతాడు. డబ్బు కోసం ఆ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని త‌రిమికొడ‌తాన‌ని 10 లక్షలకు కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఆ ఇంట్లో ఎంట్రీ ఇచ్చాక నరష్ అక్క‌డే ఇరుక్కుపోవాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తుతాయి. ఈ లోగా దెయ్యం...ఈ నకిలీ భూతవైద్యుడుతో ఆడుకోవటం మొదలెడుతుంది. ఈ లోగా దెయ్యానికి నరేష్ కు లింక్ ఉందని రివీల్ అవుతుంది. అలాంటి క్లిష్టమైన పరిస్దితుల్లో న‌రేష్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ? దెయ్యానికి న‌రేష్ ప్రేమించిన అమ్మాయికి ఉన్న సంబంధం ఏమిటి ? న‌రేష్ త‌న ప్రేమ‌ను ఎందుకు వ‌దులుకోవాల్సి వ‌చ్చింది ? చివ‌ర‌కు ఈ క‌థ ఎలా మ‌లుపులు తిరిగి ఎలా ముగిసింది ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.
Read More

ఇంట్లో దెయ్యం నాకేం భయం కాస్ట్ & క్రూ

ఇంట్లో దెయ్యం నాకేం భయం సిబ్బంది సమాచారం

దర్శకత్వం జి. నాగేస్వర రెడ్ది
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాయి కార్తీక్
నిర్మాత బీ వీ ఎన్ ఎస్ ప్రసాద్‌
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఇంట్లో దెయ్యం నాకేం భయం విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సాధారణంగా దెయ్యాలు భయపెడుతూంటే చాలా టెర్రిఫిక్ గా ఉంటాయి. అయితే ఈ సినిమాలో దెయ్యం చాలా మంది దెయ్యంలా ఉంది. పెళ్లి చేసుకోమని గోల తప్పిస్తే పెద్దగా భయపెట్టే కార్యక్రమాలు పెట్టుకోదు. అలాంటి దెయ్యాన్ని చూస్తూంటే భయం వెయ్యకపోగా జాలి వేస్తుంది. పాపం హీరో ..ఆ దెయ్యాన్ని పెళ్లి చేసుకుంటే పోలా అనిపిస్తుంది. ఇక ఈ చిత్రంలో కామెడీ ఉన్నా కూడా నాగేశ్వర్ రెడ్డి, నరేష్ ల కాంబినేషన్ లో వచ్చిన గత సినిమాలతో పోలిస్తే ఇది తక్కువనే చెప్పాలి. ఇక ప్రతి హర్రర్ సినిమాలానే ఈ చిత్ర క్లైమాక్స్ కూడా రొటీన్ గానే ఉంది. కథ మధ్యలో ప్రేమ అనే పాయింటును సరిగ్గానే జొప్పించినా దాన్ని చివరి వరకూ తీసుకురావడం, దానికి మంచి ఫీల్ తో కూడిన ముగింపు ఇవ్వడంలో దర్శకుడు విఫలమయ్యాడనే చెప్పాలి. కథలో కీలకమైన దెయ్యం ప్లాష్ బ్యాక్ కూడా చాలా రొటీన్ గా, బలహీనంగా ఉండటంతో ఆ పాత్రతో కనెక్టవడం కష్టమైంది. దెయ్యానికి రెండు లక్ష్యాలు ఏర్పడటంతో ఏ ఒక్కదానికీ నూటికి నూరు శాతం న్యాయం జరగక, క్లైమాక్స్ లో వెలితిగా అనిపించింది.

ఇంట్లో దెయ్యం నాకేం భయం సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఇంట్లో దెయ్యం నాకేం భయం

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+