X
తెలుగు » సినిమాలు » ఇప్పుడు కాకా ఇంకెప్పుడు
ఇప్పుడు కాకా ఇంకెప్పుడు

ఇప్పుడు కాకా ఇంకెప్పుడు

Romance | 06 Aug 2021 | A | 148 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

ఇప్పుడు కాకా ఇంకెప్పుడు స్టోరీ

ఇప్పుడు కాకా ఇంకెప్పుడు సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో హశ్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ, తనికెళ్ళ భరణి, తులసి శివమణి, పూజ రామచంద్రన్, రాజా రవీంద్ర, రాకెట్ రాఘవ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వై యుగంధర్ వహించారు. నిర్మాత గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. సాహిత్య సాగర్ స్వరాలు అందించారు.  కథ  పిల్లలు చెడిపోతారనే భయంతో గౌతమ్ (హస్వంత్ వంగా), అను ( నమ్రతా దరేకర్)ను తల్లిదండ్రులు స్నేహితులకు దూరంగా తీవ్రమైన ఆంక్షలతో తల్లిదండ్రలు పెంచుతారు. అయితే వైజాగ్‌లోనే పెరుగుతూ ఇలాంటి కట్టుబాట్లు, ఆంక్షల మధ్య కూడా బాల్యంలోనే యాక్సిడెంటల్‌గా గౌతమ్, అను లిప్‌లాక్ పెట్టుకొంటారు. అప్పుడే ఒకరంటే మరొకరికి ఆకర్షణ పెరుగుతుంది. చదువులు పూర్తయ్యాక హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరి ఒకరికొకరు పరిచయం అవుతారు. ఆకర్షణలో పడిన ఈ ఇద్దరు పెళ్లికి ముందే సెక్స్ సిద్ధమవుతారు. పల్లవిగా అను, రిషిగా పేర్లు మార్చుకొని అలా లైఫ్‌ను ఎంజాయ్ చేసిన తర్వాత వారి మధ్య బ్రేకప్ చోటుచేసుకొంటుంది. అయితే ఊహించని విధంగా ఇద్దరికి పెళ్లి చూపులు జరుగుతాయి. తల్లిదండ్రుల ఆంక్షల మధ్య పెరిగిన అను, గౌతమ్ మధ్య లిప్‌లాక్ ఎలా జరిగింది? హైదరాబాద్‌లో అను, గౌతమ్ ఎలా కలుసుకొన్నారు? పెళ్లికి ముందు సెక్స్ అనే కాన్సెప్ట్‌తో వారిద్దరి మధ్య ఒప్పందం కుదరడానికి కారణాలు ఏమిటి? అలా శృంగార జీవితాన్ని అనుభవిస్తున్న సమయంలో పల్లవి (అను) రిషి (గౌతమ్)కు ఎందుకు బ్రేకప్ చెప్పింది? పెళ్లి చూపుల్లో మళ్లీ కలుసుకొన్న తర్వాత వారిద్దరి మధ్య ఏం జరిగింది? పెళ్లి చూపులు జరిగాయా? పెళ్లి వరకు రావడానికి ముందు వారి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి అనే ప్రశ్నలకు సమాధానమే ఇప్పుడు కాక ఇంకెప్పుడు మూవీ కథ.
Read More

ఇప్పుడు కాకా ఇంకెప్పుడు కాస్ట్ & క్రూ

ఇప్పుడు కాకా ఇంకెప్పుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం వై యుగంధర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాహిత్య సాగర్
నిర్మాత గోపాలకృష్ణ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఇప్పుడు కాకా ఇంకెప్పుడు విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ఇప్పుడు కాక ఇంకెప్పుడు చిత్రం గురించి ఫైనల్‌గా మాట్లాడుకోవాలంటే పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు అనుసరించే విధానాలు, క్రమశిక్షణ పేరుతో వారి బాల్యాన్ని ఎలా తప్పుదారిని పట్టిస్తున్నారనే విషయాన్ని చెప్పే కథగా ఈ చిత్రం రూపొందింది. పెళ్లికి ముందు సెక్స్ అనే ఎట్రాక్టివ్ పాయింట్‌తో సమాజానికి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. పిల్లలకు అన్నీ తెలియచెప్పాలి. అలాగే మంచి, చెడు ఏమిటో వారికి నేర్పించాలి అనే పాయింట్ ఈ సినిమాను ఫీల్‌గుడ్‌గా మార్చింది. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలు తప్పిస్తే.. ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియెన్స్ చక్కగా ఎంజాయ్ చేసే అంశాలు ఉన్నాయి. సెకండాఫ్‌ కొంత పార్ట్ సినిమాను వీక్‌గా మార్చిందనే ఫీలింగ్ కలుగుతుంది. కాకపోతే వారాంతంలో ఎంజాయ్ చేయాలనుకొనే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్. యూత్‌కు కనెక్ట్ అయితే కమర్షియల్‌గా మంచి ఫలితాన్ని అందుకొనే అవకాశం పుష్కలంగా ఉంది.

ఇప్పుడు కాకా ఇంకెప్పుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఇప్పుడు కాకా ఇంకెప్పుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+