Ippudu Kaaka Inkeppudu Trailer : రిలేషన్ విత్ బెనిఫిట్స్ అంటూ పిచ్చెక్కిస్తున్న రొమాన్స్ సీన్స్
ఈ మధ్యకాలంలో చిన్న సినిమానా ? పెద్ద సినిమానా ? అనే దాని కంటే కంటెంట్ ఉందా ? లేదా ? అనేదాని మీదనే ప్రేక్షకులు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. అందుకే చిన్న సినిమాలు అయినా సరే కంటెంట్ బాగుంటే మంచి ఆదరణ దక్కుతోంది. అలా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతోంది ఇప్పుడు కాక ఇంకెప్పుడు సినిమా. ఆ ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ ఎలా ఉందంటే?

ఆగస్టు 6న రిలీజ్
యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ 'ఇప్పుడు కాక ఇంకెప్పుడు' సినిమాను శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందించారు. వై.యుగంధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని చింతా రాజశేఖర్ రెడ్డి సమర్పణలో చింతా గోపాలకృష్ణ (గోపి) నిర్మించారు. ఈ సినిమాలో హస్వంత్ వంగా, నమ్రత దరేకర్, కాటలైన్ గౌడ వంటి వారు హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఆగస్టు 6న రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.

దూరం దూరంగా
చిన్నప్పటి నుంచి అమ్మాయిలకు దూరంగా పెరిగిన అబ్బాయికి, అలాగే అబ్బాయిలకు దూరంగా పెరిగిన అమ్మాయికి మధ్య జరిగిన రొమాంటిక్ జర్నీ ఎలా సాగింది అనే అంశంతో ఈ సినిమాని రూపొందించారు. తనికెళ్ల భరణి కీలకపాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ కాగా ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

నచ్చినంతగా ఎంజాయ్ చేద్దామని
ట్రైలర్ మొత్తం అడల్ట్ సీన్స్ తో, ముద్దు సన్నివేశాలతో యూత్‌కి కనెక్ట్ అయ్యే సీన్స్ తో ట్రైలర్ మొత్తాన్ని నింపేశారు. ఒకరినొకరు టచ్ చేసుకుంటూ, హగ్ చేసుకుంటున్న సీన్స్ అయితే కోకొల్లలు. రిలేషన్ విత్ బెనిఫిట్స్ నచ్చినంత వరకు నచ్చినంతగా ఎంజాయ్ చేద్దామని హీరోయిన్ హీరోతో చెబుతూ ఉన్న డైలాగ్స్ అయితే ట్రైలర్ కి హైలైట్ గా నిలిచాయి.
సుమతో విభేదాలు గురించి రాజీవ్ కనకాల క్లారిటీ.. అందుకే దూరంగా అంటూ షాకింగ్ కామెంట్స్!

ఫ్లాట్ కి వస్తావా?
ఆర్గానిక్ పీస్ లాగా ఉన్నావు, ఫ్లాట్ కి వస్తావా? నీకు అయితే అన్నీ ఫ్రీ అంటూ సాగుతున్న డైలాగులు సినిమా మీద ఆసక్తి పెంచుతున్నాయి. రోజూ దొబ్బి తాగడం, తల పట్టేసిందని కూర్చోవడం అంటూ సాగుతున్న డైలాగులు అసక్తి రేకెత్తిస్తున్నాయి.మొత్తం మీద ఈ సినిమా క్లిక్ అయితే రచ్చ రేపడం ఖాయం అని చెప్పక తప్పదు.
అందరూ కొత్త వారే
అయితే తనికెళ్ళ భరణి, రాజా రవీంద్ర, సీత మినహా మిగతా వాళ్ళందరూ కొత్త వారే కావడంతో కాస్త కనెక్ట్ కావడానికి యూత్ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కానీ సినిమా మొత్తం బోల్డ్ సీన్స్ నింపేయడంతో కథా-కథనం కూడా నచ్చితే కచ్చితంగా హిట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి ఏమవుతుందనేది.


Click it and Unblock the Notifications











