twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    SR Kalyana Mandapam, Ippudu Kaaka Inkeppudu day 1 collections..వసూళ్లు ఎంతంటే

    |

    కరోనావైరస్ సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతపడటంతో పెద్ద చిత్రాలతోపాటు చిన్నా, చితిక సినిమాల రిలీజ్ నిలిచిపోయాయి. అయితే ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో పరిస్థితులు మెరుగు పడటంతో థియేటర్లను మెల్లమెల్లగా ఓపెన్ చేస్తున్నారు. ఈ క్రమంలో సినిమాల రిలీజ్‌లు ఊపందుకొన్నాయి. అయితే ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా టాలీవుడ్‌లో భారీ సంఖ్యలో శుక్రవారం అంటే జూన్ 8వ తేదీన పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ సినిమాల ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయంటే...

    ఒకే రోజు ఏడు సినిమాలు..

    ఒకే రోజు ఏడు సినిమాలు..

    తెలుగు సినిమా రంగంలో ఆగస్టు తొలివారంలో ఏడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో SR కల్యాణమండపం, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, క్షీరసాగర మథనం, మెరిసే మెరిసే, ముగ్గురు మొనగాళ్లు, మ్యాడ్, రావణ లంక చిత్రాలు విడుదల అయ్యాయి. ఇందులో SR కల్యాణమండపం, క్షీరసాగర మథనం, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, మెరిసే మెరిసే చిత్రాలు మంచి బజ్‌ను అందుకొన్నాయి. ఈ సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్ మాత్రమే కాకుండా మంచి ఒపెనింగ్స్ వచ్చినట్టు బిజినెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    కిరణ్ అబ్బవరం రెండో సినిమా

    కిరణ్ అబ్బవరం రెండో సినిమా


    రాజా గారు.. రాణి వారు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్ అబ్బవరం తన రెండో సినిమాగా SR కల్యాణమండపం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ రావడంతో ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. ఇకా రొమాంటిక్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఇప్పుడు కాక ఇంకెప్పుడు చిత్రానికి కూడా మంచి రెస్పాన్సే వచ్చింది. దాంతో థియేటర్లలో శుక్రవారం సందడి కనిపించింది.

    SR కల్యాణమండపం ప్రీ రిలీజ్ బిజినెస్

    SR కల్యాణమండపం ప్రీ రిలీజ్ బిజినెస్

    SR కల్యాణమండపం చిత్రానికి ఓ రేంజ్‌లో బిజినెస్ జరిగింది. నైజాంలో 1 కోటికిపైగా, సీడెడ్‌లో 1 కోటికిపైగా, వైజాగ్‌లో 72 లక్షల మేర బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా ఈ చిత్రం 4 కోట్ల మేర బిజినెస్ జరిగినట్టు తెలిసింది. అయితే కొన్ని చోట్ల నిర్మాతలే స్వయంగా రిలీజ్‌కు పూనుకొన్నారు. దాంతో ఈ చిత్రం హిట్ చిత్రంగా నిలువాలంటే సుమారు రూ.4 కోట్లకుపైగా నికర వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

    చిన్న చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్

    చిన్న చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్


    ఇక ఇప్పుడు కాక ఇంకెప్పుడు, ఇతర చిన్న సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ పెద్దగా జరగలేదని, నిర్మాతలు స్వయంగా రంగంలోకి దిగినట్టు సమాచారం. ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లతో ఒప్పందం చేసుకొని థియేటర్లలోకి ఈ సినిమాను తీసుకొచ్చినట్టు సమాచారం. మిగితా సినిమాల పరిస్థితి కూడా అలాగే ఉన్నట్టు సమాచారం. అధికారికంగా ప్రీ రిలీజ్ వివరాలు బయటకు వెల్లడించడానికి యూనిట్లు నిరాకరిస్తున్నట్టు సమాచారం.

    బెటర్‌గానే ఓపెనింగ్స్ అంటూ

    బెటర్‌గానే ఓపెనింగ్స్ అంటూ

    SR కల్యాణమండపం, ఇప్పుడు కాక ఇంకెప్పుడు చిత్రాల ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్ పరిస్థితి చూస్తే సెకండ్ లాక్ డౌన్ తర్వాత బెటర్‌గానే ఉన్నట్టు తెలుస్తున్నది. ఓవరాల్‌గా ఇప్పుడు కాక ఇంకెప్పుడు చిత్రం తొలి రోజున 10 లక్షల రూపాయల లోపు, SR కల్యాణమండపం చిత్రం 30 లక్షల రూపాయల లోపు ఉండే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఏపీలో థియేటర్లలో ప్రేక్షకులకు అంతగా స్పందన లేదనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు ప్రస్తావిస్తున్నారు.

    Recommended Video

    Kiran Abbavaram Birthday Special Interview | SR Kalyanamandapam | Sammathame
    వారాంతంలో ప్రేక్షకులపై

    వారాంతంలో ప్రేక్షకులపై

    SR కల్యాణమండపం, ఇప్పుడు కాక ఇంకెప్పుడు, మెరిసే మెరిసే చిత్రాలకు పబ్లిక్ టాక్ బాగున్నందున రెండో రోజు కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. శని, ఆదివారాల్లో మరింత రెస్సాన్ ఉంటుంది. వారాంతంలో ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే ఆశాభావంతో ట్రేడ్ వర్గాలు ఉన్నాయి.

    English summary
    Tollywood witnesses seven releases like, SR Kalyana Mandapam, Ippudukaka Inkeppudu, Merise Merise, Mad, Mugguru Monagallu, Ksheera Sagara Madanam, Ravanalanka. Here are the pre release business..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X