ఇస్మార్ట్ శంకర్ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేష్, సత్య దేవ్, గెటప్ శ్రీను, సయాజి షిండే, లేఖ ప్రజాపతి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పూరి జగన్నాధ్ వహించారు మరియు నిర్మాత చార్మి కౌర్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించారు.
కథ
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఇస్మార్ట్ శంకర్ ( రామ్ పోతినేని) కిరాయి రౌడీ. కాశీనాథ్ (పూనిత్ ఇస్సార్) హత్యకేసులో శిక్ష అనుభవిస్తూ జైలు నుంచి తప్పించుకొంటాడు. తన ప్రేయసి చాందినీ (నభ నటేష్) మరణానికి కారణమైన, తనను జైలుకు పంపేందుకు కుట్ర చేసిన వ్యక్తి ఎవరనే విషయంపై వెంటాడుతుంటాడు. ఇదే హత్య కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ అధికారి అరుణ్ (సత్యదేవ్) ఎన్‌కౌంటర్‌లో మరణిస్తాడు. అతని విచారణకు సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి మెమరీ ట్రాన్స్‌ఫర్ అనే వైద్య ప్రక్రియకు పూనుకొంటారు. దాంతో ఇస్మార్ట్ శంకర్ దేహాన్ని వాడుకొని, బ్రెయిన్‌లో చిప్ సెట్ చేస్తారు?
అరుణ్ మెమోరీస్ ట్రాన్స్‌ఫర్ విషయంలో వైద్య చికిత్స సఫలమైందా? ఈ వైద్య చికిత్స వల్ల ఇస్మార్ట్ శంకర్‌కు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి?. ఈ కథలో సారా (నిధి అగర్వాల్) పాత్ర ఏమిటి? ఇస్మార్ట్ శంకర్ ప్రేయసి చాందినీ (నభ నటేష్) ఎలా మరణించింది? తన ప్రేయసి మరణానికి కారణమైన వ్యక్తి ఎవరు? తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన కుట్రదారుడిని ఇస్మార్ట్ తెలుసుకొన్నాడా? అనే ప్రశ్నలకు సమాధానమే ఇస్మార్ట్ శంకర్ సినిమా కథ.