X
జై లవ కుశ
Action | Romance | 21 Sep 2017 | U/A |
Telugu

జై లవ కుశ స్టోరీ

జై లవ కుశ సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జునియర్ ఎన్ టి ఆర్, రాశిఖన్నా, నివేద థామస్, దునియా విజయ, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజి, ప్రదీప్ రావత్, జయప్రకాష్ రెడ్ది, ప్రభాస్ శ్రీను, హంస నందిని తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె ఎస్ రవింద్ర వహించారు మరియు నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బేనర్లో కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చరు.

కథ

జై, లవ, కుశ (ఎన్టీఆర్) ముగ్గురు కవలలు. నాటకాలు వేయడం అంటే ముగ్గురికి ప్రాణం. తన మేనమామ (పోసాని కృష్ణమురళి) నేతృత్వంలో నాటకాలు ఆడుతుంటారు. అయితే జైకి పుట్టుకతోనే నత్తి. నత్తి కారణంగా జైని తన మేనమామ తొక్కేస్తాడు. తనకు గుర్తింపు లేకుండా పోవడంతో తన సోదరులు లవ, కుశలపై కోపం పెంచుకొంటారు ఓ నాటకం ప్రదర్శిస్తుండగా వారిని చంపడానికి సిలెండర్ పేల్చుతాడు. ఆ ఘటన వల్ల ముగ్గురు సోదరులు విడిపోతారు. వారు అలా వేర్వేరు ప్రదేశాల్లోపెరిగి పెద్దవుతారు. లవ బ్యాంక్ ఆఫీసర్‌గా, కుశ చిల్లర దొంగగా మారుతారు. ఆ క్రమంలో కష్టాల్లో ఉన్న లవ, కుశ ఓ ప్రమాదం సందర్భంగా కలుసుకొంటారు. మంచితనం ఎక్కువగా ఉండే లవ అడిగిన వారందరికీ అప్పులు ఇచ్చి ఇబ్బందుల్లో కూరుకుంటాడు. దొంగతనాలు చేసి డబ్బు సంపాదించి అమెరికాకు వెళ్లాలన్న ప్రయత్నానికి నోట్ల రద్దు గండికొడుతుంది. తమ్ముడిని మోసగించి డబ్బు కొట్టేయాలను ప్లాన్ చేసి సక్సెస్ అవుతాడు. కానీ చివరి క్షణంలో డబ్బు మాయం అవుతుంది. అలా కథ నడుస్తున్న క్రమంలో ప్రియ (రాశిఖన్నా)తో లవ ప్రేమలో పడుతాడు. పెళ్లి చేసుకొందామనే క్రమంలో ప్రియ అదృశ్యమవుతుంది. లవకు తమ్ముడు కుశుడి మీద, కుశుడికి అన్న లవ మీద అనుమానం కలుగుతుంది. కానీ వారిద్దరూ తప్పు చేయలేదని గ్రహిస్తారు. తన మాదిరిగానే ఉండే వ్యక్తి తన ప్రియను ఎత్తుకెళ్లి ఉంటారని గ్రహిస్తారు. అంటే తమ అన్న ఇంకా బతికి ఉన్నాడనే నమ్మకం కలిగిన నేపథ్యంలో జై క్యారక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అంతలోనే లవ, కుశలను జై కిడ్నాప్ చేస్తాడు. చిన్నతనంలో తనకు గుర్తింపు లేకుండా చేసిన తమ్ముళ్లపై జై కక్ష పెంచుకొంటాడు. జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలన్న లక్ష్యానికి సహకరించాలని వారిని జై ఆదేశిస్తాడు. సొంత సోదరులను, ప్రియను జై ఎందుకు కిడ్నాప్ చేశాడు. జై లక్ష్యం ఏమిటి? అన్నయ్య లక్ష్యానికి తమ్ముళ్లు చేసిన ఎలాంటి సహకారం అందించారు. తమ్ముళ్లు, మేనమామ వివక్ష కారణంగా రావణుడిగా మారిన జై మళ్లీ మంచి వాడు అవుతాడా? రావణుడిగా మారిన తన అన్నను రాముడిగా మార్చాలన్న లవ, కుశల ప్రయత్నం ఫలించిందా? రావణుడు మళ్లీ రాముడిగా మారాడా? ముగ్గురు అన్నదమ్ములు ఒక్కటవుతారా? ప్రియతో లవ్ పెళ్లి అవుతుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే జై లవకుశ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+