X
తెలుగు » సినిమాలు » జై లవ కుశ
జై లవ కుశ

జై లవ కుశ

Action | Romance | 21 Sep 2017 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

జై లవ కుశ స్టోరీ

జై లవ కుశ సినిమా యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జునియర్ ఎన్ టి ఆర్, రాశిఖన్నా, నివేద థామస్, దునియా విజయ, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మాజి, ప్రదీప్ రావత్, జయప్రకాష్ రెడ్ది, ప్రభాస్ శ్రీను, హంస నందిని తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె ఎస్ రవింద్ర వహించారు మరియు నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బేనర్లో కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చరు. కథ జై, లవ, కుశ (ఎన్టీఆర్) ముగ్గురు కవలలు. నాటకాలు వేయడం అంటే ముగ్గురికి ప్రాణం. తన మేనమామ (పోసాని కృష్ణమురళి) నేతృత్వంలో నాటకాలు ఆడుతుంటారు. అయితే జైకి పుట్టుకతోనే నత్తి. నత్తి కారణంగా జైని తన మేనమామ తొక్కేస్తాడు. తనకు గుర్తింపు లేకుండా పోవడంతో తన సోదరులు లవ, కుశలపై కోపం పెంచుకొంటారు ఓ నాటకం ప్రదర్శిస్తుండగా వారిని చంపడానికి సిలెండర్ పేల్చుతాడు. ఆ ఘటన వల్ల ముగ్గురు సోదరులు విడిపోతారు. వారు అలా వేర్వేరు ప్రదేశాల్లోపెరిగి పెద్దవుతారు. లవ బ్యాంక్ ఆఫీసర్‌గా, కుశ చిల్లర దొంగగా మారుతారు. ఆ క్రమంలో కష్టాల్లో ఉన్న లవ, కుశ ఓ ప్రమాదం సందర్భంగా కలుసుకొంటారు. మంచితనం ఎక్కువగా ఉండే లవ అడిగిన వారందరికీ అప్పులు ఇచ్చి ఇబ్బందుల్లో కూరుకుంటాడు. దొంగతనాలు చేసి డబ్బు సంపాదించి అమెరికాకు వెళ్లాలన్న ప్రయత్నానికి నోట్ల రద్దు గండికొడుతుంది. తమ్ముడిని మోసగించి డబ్బు కొట్టేయాలను ప్లాన్ చేసి సక్సెస్ అవుతాడు. కానీ చివరి క్షణంలో డబ్బు మాయం అవుతుంది. అలా కథ నడుస్తున్న క్రమంలో ప్రియ (రాశిఖన్నా)తో లవ ప్రేమలో పడుతాడు. పెళ్లి చేసుకొందామనే క్రమంలో ప్రియ అదృశ్యమవుతుంది. లవకు తమ్ముడు కుశుడి మీద, కుశుడికి అన్న లవ మీద అనుమానం కలుగుతుంది. కానీ వారిద్దరూ తప్పు చేయలేదని గ్రహిస్తారు. తన మాదిరిగానే ఉండే వ్యక్తి తన ప్రియను ఎత్తుకెళ్లి ఉంటారని గ్రహిస్తారు. అంటే తమ అన్న ఇంకా బతికి ఉన్నాడనే నమ్మకం కలిగిన నేపథ్యంలో జై క్యారక్టర్ ఎంట్రీ ఇస్తుంది. అంతలోనే లవ, కుశలను జై కిడ్నాప్ చేస్తాడు. చిన్నతనంలో తనకు గుర్తింపు లేకుండా చేసిన తమ్ముళ్లపై జై కక్ష పెంచుకొంటాడు. జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలన్న లక్ష్యానికి సహకరించాలని వారిని జై ఆదేశిస్తాడు. సొంత సోదరులను, ప్రియను జై ఎందుకు కిడ్నాప్ చేశాడు. జై లక్ష్యం ఏమిటి? అన్నయ్య లక్ష్యానికి తమ్ముళ్లు చేసిన ఎలాంటి సహకారం అందించారు. తమ్ముళ్లు, మేనమామ వివక్ష కారణంగా రావణుడిగా మారిన జై మళ్లీ మంచి వాడు అవుతాడా? రావణుడిగా మారిన తన అన్నను రాముడిగా మార్చాలన్న లవ, కుశల ప్రయత్నం ఫలించిందా? రావణుడు మళ్లీ రాముడిగా మారాడా? ముగ్గురు అన్నదమ్ములు ఒక్కటవుతారా? ప్రియతో లవ్ పెళ్లి అవుతుందా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే జై లవకుశ.
Read More

జై లవ కుశ కాస్ట్ & క్రూ

జై లవ కుశ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కె ఎస్ రవింద్ర
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత కళ్యాణ్ రామ్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

జై లవ కుశ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
జై లవకుశ సినిమా తెనాలి నాటక సంఘం ప్రదర్శించే రామాయణం నాటికతో ప్రారంభమవుతుంది. కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లడానికి ఈ ఘట్టం అద్భుతంగా సహకారం అందించింది. ప్రథమార్థంలో లవ, కుశ పాత్రలతో సరదాగా సినిమా సాగిపోతుంది. ఇంటర్వెల్‌కు ముందు ఫైట్‌తో జై పాత్ర పరిచయం కావడంతో థియేటర్లో అలజడి మొదలవుతుంది. ఇంట్రడక్షన్ సీన్‌లోనే జై పాత్ర డెప్త్ ఏంటో దర్శకుడు బాబీ చెప్పేశాడు. జై పాత్ర ఏంటి? జైలో దుష్ణ రావణుడు ఎలా ఉంటాడు. అతని నేర సామ్రాజ్యం ఏమిటీ అనే కథాంశంతో ముందుకెళ్తుతుంది. తన లక్ష్యం దిశగా తమ్ముళ్లను వాడుకోవాలనుకునే పాయింట్‌తో కథ కొత్త మలుపు తిరుగుతుంది. బాల్యంలో జై రావణుడిగా మారే తీరును.. అలాగే పెద్దయ్యాక సోదరుల ప్రేమకు కరిగిపోయి రావణుడు రాముడిగా మారే విధానాన్ని బాబీ చక్కగా తెరకెక్కించాడు. క్లైమాక్స్‌లో సెంటిమెంట్‌ను బాగా దట్టించాడు. చివరి పది నిమిషాల్లో జై పాత్రలో ఎన్టీఆర్ నటన ఆకట్టుకుంటుంది. రెంబో భాగంలో అన్నదమ్ముల మధ్య బంధాలను మళ్లీ పునరుద్ధరించాడానికి వేసిన నాటకం హైలెట్‌గా నిలుస్తుంది. చిత్ర ద్వితీయార్థంలో కథా వేగం కొంత మందగించినట్టు.. సినిమాను ఏదో చుట్టేసినట్టు అనిపిస్తుంది. చివర్లో అన్నదమ్ముల మధ్య ఎమోషన్స్‌ను దర్శకుడు బాబీ తెరకెక్కించిన విధానాన్ని అభినందించకుండా ఉండలేం. రెండో భాగంలో రాశీఖన్నా, నివేదా గ్లామర్‌తోపాటు తమన్నా ఐటెంసాంగ్ ప్రేక్షకులను ఉత్తేజానికి గురిచేస్తాయి. చివర్లో ఎమోషనల్ ముగింపుతో జై లవకుశను ముగించడం దర్శకుడి ప్రతిభకు అద్దం పడుతుంది.

జై లవ కుశ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

జై లవ కుశ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+