X
జేమ్స్ బాండ్
Comedy | Romance | 24 Jul 2015 | U/A |
Telugu

జేమ్స్ బాండ్ స్టోరీ

జేమ్స్ బాండ్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లరి నరేష్, సాక్షి చౌదరి, అశిస్ విద్యార్తి, జయ ప్రకాష్ రెడ్డి, చంద్ర మోహన్, రఘు బాబు, క్రిష్ణా భగవాణ్ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సాయి కిషోర్ నిర్వహించారు మరియు నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చారు. 

కథ

లేడీ డాన్ బుల్లెట్ (సాక్షీ చౌదరి) చిన్నప్పుడే విడిపోయిన తల్లిని కలుసుకుంటుంది. ఆ తర్వాత ఆ తల్లి కాన్సర్ తో భాధపడుతోందని తెలుసుకుంటుంది. డాక్టర్ సూచన మేరకు.. ఆమెను సంతోషంగా ఉంచితే త్వరగా రికవరీ అవుతుందనే విషయం తెలుసుకుంటుంది. ఆ క్రమంలో తల్లి కోరికలు తీర్చాలని నిర్ణయించుకుంటుంది. అంతేకాదు..తల్లి దగ్గర తన ఐడెంటిటీ దాచాలనుకునుకుంటుంది. ఇంతకీ ఆ తల్లి కోరిక ఏమిటీ అంటే...తన కూతురు వివాహం చూడటం. దాంతో బుల్లెట్ కు ఇష్టం లేకపోయినా తప్పని సరి పరిస్ధితుల్లో వరుడు వేట మొదలెడుతుంది. మరో ప్రక్క నాని(అల్లరి నరేష్) సాప్ట్ గా ఉండే సాఫ్ట్ వేర్ ఇంజినీరు. ఓ సారి తన తల్లితో సంప్రదాయ బద్దగా తయారై గుళ్లోకి వచ్చిన బుల్లెట్ ని చూసి మనస్సుపారేసుకుంటాడు. ఆమె కోసం వెతుకుతూంటాడు. ఆ క్రమంలో ఆమెకూడా పెళ్లి కొడుకు కోసం వెతుకుతోందని ఓ మ్యారేజ్ బ్యూరో ఓనర్ (కృష్ణ భగవాన్) ద్వారా తెలుసుకుని ఓ అడుగు ముందుకేసి,ఆమెతో ఏడు అడుగులు నడుస్తాడు. ఆ తర్వాత కొంత కాలానికి అతనికి తను పెళ్లి చేసుకున్నది కత్తిలాంటి అమ్మాయిని కాదని కత్తిని అని తెలుసుకుంటాడు. అప్పుడేం అయ్యింది. తెలిసిన నాని ఏం చేసాడు. మరో ప్రక్క బుల్లెట్ ని చంపాలని తిరుగుతున్న ఆమె ప్రత్యర్ది (ఆశిష్ విద్యార్ధి) సంగతి ఏంటి...వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+