కల్కి 2898 ఏడి సినిమా సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రభాస్, దీపికా పదుకొనే, అమితాబ్ బచ్చాన్, కమల్ హసన్, పసుపతి తదితరలు ముఖ్యపాత్రాలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం నాగ్ అశ్విన్ వహిస్తున్నారు. నిర్మాత అశ్విని దత్త్ నిర్మిస్తున్నారు.
'కల్కి' గ్లింప్స్ విషయానికి వస్తే...
సినిమా భారీతనం చూపించారు. ఈ వీడియో విడుదల తర్వాత ప్రభాస్ అభిమానులు, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పవచ్చు. ప్రపంచాన్ని దుష్టశక్తి ఆవహించినప్పుడు ఒక శక్తి ఉద్భవిస్తుందని 'కల్కి' టీజర్ లో చెప్పారు. ఆ శక్తిగా ప్రభాస్ ను చూపించారు. కథలో టైమ్ ట్రావెల్ గురించి హింట్ ఇచ్చారు. దీపికా పదుకోన్ సీన్లు కూడా చూపించారు.
బడ్జెట్
వైజయంతి మూవీస్ పతాకంపై దీనిని సి. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. సుమారు 400 కోట్ల నిర్మాణ వ్యయంతో 'ప్రాజెక్ట్ కె' తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.