కళ్యాణ వైభోగమే సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ శౌర్య, మాలవిక నాయర్, పీర్లీ మానై, రాషి, అనంద్, ప్రగత్య, ధన్ రాజ్, హేమంత్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నందిని రెడ్డి నిర్వహించారు మరియు నిర్మాత కె ఎల్ దామోదర ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కళ్యాణి మాలిక్ స్వరాలు సమకుర్చారు.
కథ
పెళ్లంటే ఇష్టం లేని గేమ్ డిజైనర్ శౌర్య (నాగశౌర్య) ... దివ్య (మాళవికా నాయర్) . కానీ వీళ్ల తల్లి తండ్రులు మాత్రం పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తూండటంతో..దాంతో వీళ్లద్దరూ కలిసి ఓ ప్లాన్ వేస్తారు. పెళ్లి అనే తంతుని డ్రామాగా ఆడటం మొదలెడతారు. ఆ డ్రామా ఏ మలుపు తిరిగింది. ఎలాంటి పరిణాలకు దారి తీసింది. వీళ్లద్దరూ చివరకు ఎలా ఒకటయ్యారు. ఇంతకీ పెళ్లి అంటే చివరకు వీళ్లిద్దరూ ఆసక్తి పెంచుకున్నారా వంటి విషయాలతో కూడిన సినిమా ఇది.