X
కపటధారి
Crime | Thriller | 19 Feb 2021 | U/A |
Telugu

కపటధారి స్టోరీ

కపటధారి సినిమా క్రైమ్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమంత్‌, నాజ‌ర్‌, నందిత‌ శ్వేత, పూజా కుమార్‌, వెన్నెల కిషోర్‌, జ‌య‌ప్రకాశ్‌, సంప‌త్ ప్రధాన పాత్రల్లో న‌టిస్తున్నారు. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. లలిత ధ‌నంజ‌యన్ నిర్మిస్తున్నారు. సైమ‌న్ కె. కింగ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. డా.ధ‌నుంజ‌య‌న్ స్క్రీన్‌ప్లే అడాప్షన్ చేస్తుండ‌గా.. బాషాశ్రీ మాట‌లు అందిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌గా, స్టంట్ సిల్వ స్టంట్ మాస్టర్‌గా, విదేశ్ ఆర్ట్ డైరెక్టర్‌గా ఈ చిత్రానికి ప‌నిచేస్తున్నారు. 

కథ
గౌతమ్ (సుమంత్) ట్రాఫిక్ పోలీస్ అధికారి. దాదాపు 40 ఏళ్ల క్రితం జరిగిన ముగ్గురి హత్య కేసును మళ్లీ దర్యాప్తు చేయాలనుకొంటాడు. తన దర్యాప్తులో భాగంగా లాకప్ దిన పత్రిక ఎడిటర్ జేకే (జయప్రకాశ్) రిటైర్డ్ పోలీస్ అధికారి రంజిత్ (నాజర్), రమ్య (సుమన్ రంగనాథ్)ను కలుసుకొంటాడు. దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా రకరకాల ట్విస్టులు గౌతమ్‌ను కన్‌ఫ్యూజ్ చేస్తాయి. గౌతమ్‌ మర్డర్ మిస్టరీని ఎలా చేధించాడు? తన దర్యాప్తులో ముఖ్యమంత్రి అభ్యర్థి ఆలేరు శ్రీనివాస్‌కు ఎలాంటి కౌంటర్ ఇచ్చాడు? ట్రాఫిక్‌లో ఉండే గౌతమ్ క్రైమ్ సంఘటనను ఎందుకు దర్యాప్తు చేయాలనుకొంటాడు? తన అధికారులకు తెలియకుండా చేసే ఇన్వెస్టిగేషన్‌లో కలిసిన రంజిత్ ఏ విధంగా సహాయం అందించాడు? సినీనటి రమ్యకు హత్యలతో ఎలాంటి సంబంధం ఉంది? లాకప్ దిన పత్రిక ఎడిటర్ జేకేకు ఈ హత్యలకు సంబంధం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే కపటధారి కథ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+