ఖైదీ సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో కార్తి, నరైన్, జార్జ్ మార్యన్, రమణ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం లోకేష్ కనగరాజ్ వహించారు మరియు నిర్మాత ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం ష్యామ్ సి ఎస్ అందించారు.
కథ
డ్రగ్స్ మాఫియా పని పట్టాలనుకునే పోలీస్ డిపార్ట్మెంట్.. తమ సరుకును పట్టుకున్న పోలీస్ ఆఫీసర్లను మట్టు బెట్టాలని వెంటపడే రౌడీలు.. పుట్టినప్పటి నుంచి తన కూతురుని చూడకుండా ఉన్న ఖైదీ డిల్లీ(కార్తీ).. వీటన్నంటికి సంబంధం లేని ఓ స్నేహితుల బృందం.. ఒక్క రాత్రి వీరి జీవితాలను ఏ విధంగా మలిచాయి? చివరకు ఏం జరిగింది? పోలీస్ ఆఫీసర్ తన కర్తవ్యాన్ని నిర్వర్తించాడా? ఆ క్రమంలో మాజీ ఖైదీ అయిన డిల్లీ పోలీసులకు ఏవిధంగా సహాయపడ్డాడు? చివరకు ఆ ఐదుగురు స్నేహితులు ఏం అయ్యారు? తన కూతురును చూడాలనే కోరిక తీరిందా లేదా? అన్నదే కథ