twitter

    కాటమరాయుడు స్టోరి

    కాటమరాయుడు సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో పవన్ కల్యాణ్, శ్రుతీ హాసన్, అలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం కిశోర్‌కుమార్‌ పార్దసాని(డాలీ) నిర్వహించారు మరియు ఈరోస్ ఇంటర్నేషనల్ తో కలిసి నార్త్ స్టార్ ఎంటర్ టైమెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రుబెన్స్ స్వరాలు సమకుర్చురు.

    కథ

    ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌తో శ్రుతిహాసన్ రెండోసారి జతకట్టింది. ఇప్పటివరకు తమ్ముడి ఇమేజ్‌ ఉన్న పవన్ కల్యాణ్ తొలిసారిగా అన్నయ్యగా కనిపించనున్నారు. అన్నదమ్ముల అనుబంధం, లవ్, కామెడీ, ఇతర కమర్షియల్ ఎలిమెంట్స్‌, పవర్ ఫుల్ డైలాగ్స్ దట్టించిన కాటమరాయుడు మార్చి 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన కాటమరాయుడు అభిమానులను ఏ మేరకు సంతృప్తి పరిచిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. రాయలసీమలోని తాళ్లపాక గ్రామంలో కాటమరాయుడు ఓ పెద్ద తరహా వ్యక్తి. ప్రజలకు ఏ కష్టం వస్తే తన ప్రాణాలను అడ్డపెట్టి ఆదుకోవడం ఆయన నైజం. కాటమరాయుడుకి నలుగురు తమ్ముళ్లు (శివబాలాజీ, కమల్ కామరాజ్, అజయ్, చైతన్య కృష్ణ), ఓ మిత్రుడు లింగా (అలీ) ఉంటారు. ప్రేమ, పెళ్లి మనుషులను విడతీస్తాయనే భావనలో ఉంటూ అమ్మాయిలకు, పెళ్లికి కాటమరాయుడు దూరంగా ఉంటారు. కానీ నలుగురు తముళ్లు, మిత్రుడు లింగా ప్రేమలో పడుతారు. అన్నయ్యకు వివాహామైతే కానీ తమకు పెళ్లి కావడం కష్టంగా మారిన నేపథ్యంలో కాటమరాయుడ్ని ఎలాగైనా ప్రేమలో పడేలా చేయాలనుకొంటారు. సున్నిత మనస్కుడు, జంతు ప్రేమికుడు అని అబద్దాలు ఆడి ఆ గ్రామానికి వచ్చిన డ్యాన్సర్ అవంతి (శ్రుతీహాసన్)తో ప్రేమలో పడేలా చేస్తారు. అలా ప్రేమలో ఉండగా కాటమరాయుడు నిజస్వరూపం తెలుస్తుంది. తన కుటుంబానికి విరుద్ధమైన భావాలను కాటమరాయుడు కలిగి ఉన్నాడని తెలుసుకొన్న శ్రుతి హాసన్ ప్రేమ నిరాకరిస్తుంది. తన ప్రేమను కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తున్న కాటమరాయుడికి అవంతి కుటుంబానికి పెద్ద ముప్పు పొంచి ఉన్నదని తెలుసుకొంటాడు. ఇంతకి అవంతికి కుటుంబానికి ఎదురైన సమస్య ఏమిటీ? దానిని కాటమరాయుడు ఎలా పరిష్కరించాడు. అవంతితో తన ప్రేమను ఎలా దక్కించుకొన్నాడు? తన సోదరులకు ఎలా చూసుకొన్నాడు అనే ప్రశ్నలకు సమాధానమే కాటమరాయుడు సినిమా. 
    **Note:Hey! Would you like to share the story of the movie కాటమరాయుడు with us? Please send it to us ([email protected]).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X